జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాసం కోరుతూ టీడీపీ కూటమి నోటీసు ఇచ్చింది. ఈ నోటీసు ఇచ్చి పది రోజులు అవుతోంది కానీ డేట్ అయితే ప్రకటించలేదు. ఈలోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. బడ్జెట్ అన్నది చాలా ముఖ్యం కాబట్టి లాంచనం అయిన ఆ ప్రక్రియను పూర్తి చేసారు.
అవిశ్వాస తీర్మానం మీద చర్చ ఎప్పుడూ అన్నది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. బెంగళూరులో వైసీపీ కార్పోరేటర్లు అంతా ప్రత్యేక క్యాంప్‌లో విడిది చేస్తున్నారు. ఈ నెల 29న బడ్జెట్ సమావేశం సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాత్రమే వచ్చి బడ్జెట్ సెషన్‌లో పాల్గొని తిరిగి బెంగళూరు వెళ్ళిపోయారు.
ఇపుడు టీడీపీ కార్పోరేటర్లు కూడా ప్రత్యేక క్యాంప్ కోసం మలేసియా తరలివెళ్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జనసేన మాత్రం క్యాంపుల కల్చర్‌కి దూరం అని విశాఖ వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తమ పార్టీ కార్పోరేటర్లతో తొందరలోనే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ నిర్వహిస్తారు అని చెప్పారు. పవన్ మాటే తమ పార్టీకి శిరోధార్యం అని స్పష్టం చేశారు.
అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన టీడీపీ కార్పోరేటర్లు ఇపుడు మలేసియా ట్రిప్ అని ప్రచారం సాగడంతో ఎప్పుడూ అవిశ్వాసం మీద చర్చ జరుగుతుంది అన్నది అంతుబట్టడంలేదు. అయితే పైకి ఎన్ని చెబుతున్నా మేయర్ మీద మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు కూటమికి ఇంకా దక్కలేదని అంటున్నారు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అలా నంబర్ గేమ్‌లో పై చేయి సాధించిన తరువాతనే అవిశ్వాసం మీద ఒక డేట్ వస్తుందని కొందరు సభ్యులు అంటున్నారు.
ఇలా రాష్ట్రం, దేశం దాటి జీవీఎంసీ కార్పోరేటర్లు విడిది చేయడంతో మేయర్ మీద అవిశ్వాస రాజకీయానికి ఎప్పుడూ ఎండ్ కార్డు పడుతుంది అన్నది అంతా తర్కించుకుంటున్నారు. వైసీపీ అయితే సంఖ్యాబలం తమకే ఉందని అంటోంది. అయిదేళ్లు వైసీపీ మేయర్ ఉంటారని ధీమా వ్యక్తం చేస్తోంది. కూటమిలో అయితే ఇంకా రాజకీయ వ్యుహాలు ఖరారు చేసే ప్రక్రియనే సాగుతోంది అని అంటున్నారు.
ఇంట్రెస్ట్ ఉంటే నా డీపీ చూడండి
అటు వైసిపి గానీ ఇటు టిడిపికి గాని లేని ఆత్రుత నీకే ఉన్నట్టుంది కదరా గ్యాస్ ఆంధ్ర . నువ్వు కావాలంటే అవదు వద్దనుకుంటే ఆగదు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందిరా గ్యాస్ ఆంధ్ర.