కృతిశెట్టి.. శ్రీలీల.. ఇంకా.. ఇంకా..

సర్రున పైకి లేచి, చకచకా సినిమాలు చేసి, డబ్బులు సంపాదించుకోవడం తప్ప, కెరీర్‌లో సక్సెస్‌లు చూడలేకపోతున్న హీరోయిన్లు ఇద్దరూ.

సర్రున పైకి లేచి, చకచకా సినిమాలు చేసి, డబ్బులు సంపాదించుకోవడం తప్ప, కెరీర్‌లో సక్సెస్‌లు చూడలేకపోతున్న హీరోయిన్లు ఇద్దరూ. ఇద్దరిదీ భలే జర్నీ. కృతి శెట్టి అయిదేళ్లలో పది సినిమాలు చేసేసారు చకచకా. “ఉప్పెన” సినిమాతో కుర్రకారుకు జ్వరం తెప్పించేసారు. ఆ ఊపులో చకచకా సినిమాల మీద సినిమాలు వచ్చి పడ్డాయి.

నాగ్ చైతన్య, నాని, నితిన్, రామ్, శర్వానంద్ ఇలా యంగ్ హీరోల అందరి సరసన నటించేసింది కృతి శెట్టి. కానీ పాపం, ఒక్క హిట్ లేదు. “శ్యామ్ సింగ రాయ్” ఒక్కటే ఓకె సినిమా. మిగిలిన సినిమాలు అన్నీ దాదాపు డిజాస్టర్లే. తొలి సినిమా తరువాత కోటి రూపాయల పారితోషికాన్ని దాటేసిన కృతి శెట్టి చేతిలో ఇఫ్పటికీ సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీ పరభాష సినిమాలు.

శ్రీలీల విషయం తెలిసిందే. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లింది టాలీవుడ్‌లోకి. మూడేళ్లలో డజను సినిమాల వరకు చేసేసింది శ్రీలీల. మహేష్ బాబు, రవితేజ, రామ్, నితిన్ ఇలా అందరి సరసన నటించేసింది. బాలయ్య కూతురుగా నటించింది. బన్నీ సరసన స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికి శ్రీలీల చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. కానీ సమస్య ఒకటే..హిట్లు అన్నది జస్ట్ వన్ పర్సంట్ కూడా లేవు. అందువల్ల ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టుల తరువాత కెరీర్ అంతలా ముందుకు వెళ్లే అవకాశం తక్కువ కనిపిస్తోంది.

తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు నటించే అవకాశమే తక్కువ. అలాంటిది వచ్చిన చాన్స్‌ల్లో కూడా ఫేస్‌లో ఫీలింగ్స్ పలకడం లేదు అనిపించేసుకుంటే, దానికి తోడు ఫ్లాపులు పలకరిస్తే ఇదే పరిస్థితి వస్తుంది ఎవరికైనా. కేవలం రెమ్యూనిరేషన్ కోసం చేస్తూ పోతే, పట్టుమని పది సినిమాలు చేయకుండానే ఫేడ్ అవుట్ కావాల్సి ఉంటుంది. కథ, తన పాత్ర ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడాలి.

3 Replies to “కృతిశెట్టి.. శ్రీలీల.. ఇంకా.. ఇంకా..”

Comments are closed.