ఎమ్బీయస్‍: నేరమూ – శిక్షా

నోటిని అదుపులో పెట్టుకోవడం ఎంత అవసరమో పోసాని ఉదంతం చాటిచెప్పింది.

నేరానికి శిక్ష పడడం న్యాయం. అయితే నేరం ఒకటే అయినా శిక్ష ఒకేలా పడదు. నేరం చేసిన నేరస్తుడి మానసిక స్థితి, నేరానికి దారి తీసిన పరిస్థితి, ఆవేశంలో చేసినదా, ప్రణాళిక వేసుకుని చేసినదా, చర్యగా చేసినదా, ప్రతిచర్యగా చేసినదా, నేరప్రవృత్తి ముందు నుంచి ఉందా.. యిలాటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని అప్పుడు శిక్ష వేస్తారు. ఒకమ్మాయి ఒకతన్ని చంపింది. అతను మానభంగం చేయబోతే ఆత్మరక్షణలో భాగంగా చేస్తే ఒక రకమైన శిక్ష పడుతుంది. తనను ప్రేమించి, మోసం చేసినందుకు చంపితే మరో రకమైన శిక్ష. తనను ప్రేమించలేదనే కక్షతో చంపితే యింకో రకమైన శిక్ష. ఏ ఉద్దేశంతో, ఏ పరిస్థితుల్లో నేరం జరిగింది అనే దానిపై యిరు పక్షాల న్యాయవాదులు వాదిస్తారు, చివరకు న్యాయమూర్తి ఏదో ఒక తీర్పు యిస్తారు.

ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. నిందితుడు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి తగినంత సమయం యిచ్చారు అని అతనే కాక, యితరులు కూడా కన్విన్స్ అయ్యేట్లా భారత న్యాయవ్యవస్థ చేంతాడంత ప్రొసీజర్ పెట్టింది. దీనివలన నష్టాలు కూడా ఉన్నాయి. కొందరు నేరస్తులు దశాబ్దాల తరబడి స్టే తెచ్చుకుని కోర్టు మెట్లు ఎక్కడమే లేదు. మరి కొందరు సిల్లీ రీజన్స్‌తో వాయిదాలు అడుగుతూ, విచారణను సాగదీస్తూన్నారు. తీర్పు వచ్చి, శిక్ష పడే సమయానికి ‘నేను వృద్ధుణ్ని, నా వయసు చూసి జైల్లో పెట్టకండి, మందలించి వదిలేయండి’ అంటున్నారు. అదే సమయంలో పలుకుబడి లేని కొందరు అమాయకుల నెత్తి మీద కత్తి దశాబ్దాల తరబడి వేళ్లాడుతూనే ఉంటోంది. మరి కొందరు ఏ విచారణా లేకుండా జైళ్లలో మగ్గుతున్నారు.

ఇది న్యాయవ్యవస్థ తీరు అయితే, పోలీసు వ్యవస్థ తీరు మరీ అన్యాయంగా వుంటోంది. ఏవేవో కేసులు పెట్టడం, విచారణ పూర్తి కాలేదంటూ కస్టడీ అడగడం, విచారణకు సహకరించటం లేదంటూ దాన్ని పొడిగించ మనడం, ఎప్పటికీ చార్జి షీటు దాఖలు చేయకపోవడం, ఏళ్ల తరబడి దీన్ని సాగదీసి, చివరకు రాష్ట్రంలోనో, కేంద్రంలోనో ప్రభుత్వం మారగానే కేసులు ఎత్తివేయడం! ఈ లోపున నేరం గురించి మీడియాకు లీకులు యిచ్చి, నిందితుడు యిలాగట, అలాగట అంటూ ప్రజల్లో వారిపై ద్వేషాన్ని రగిలిస్తున్నారు. కోర్టు దగ్గరకు వెళ్లేసరికి, ఆ ఆధారాలు ఏవీ చూపరు. అంటే ఆధారాలు ఏవీ లేకపోయినా, ప్రజల దృష్టిలో అతన్ని బద్‌నామ్ చేసి, ఎంత శిక్ష వేసినా తప్పు లేదని అనే భావాన్ని కలిగించి, పోలీసులు అతన్ని తిట్టినా, కొట్టినా తప్పు లేదనే భావన కలిగిస్తున్నారు.

ఇవన్నీ చూస్తూ వచ్చిన ప్రజలు స్కెప్టికల్ అయిపోయారు. పోలీసులు నేరం జరిగిందని చెప్పినా జరగలేదని చెప్పినా పెదాలు చప్పరించి ఊరుకుంటున్నారు. పోలీసుల కంటె మీడియా అతి చేయడంతో, మీడియాయే ఒకర్ని దోషిగా నిలబెట్టి, వారికి వ్యతిరేకంగా వాదించి, తీర్పులు కూడా యిచ్చేయడంతో యిది ఒక ప్రహసనంగా మారింది. ఆ మీడియాకు సంబంధించిన పార్టీ అభిమానులు తప్ప తటస్థులెవరూ నమ్మని పరిస్థితి దాపురించింది. ఎన్నికల సమయంలో 40-45శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి కూడా మామూలు రోజుల్లో దాని హార్డ్‌కోర్ అభిమానులు జనంలో 30శాతంకు మించి వుండరు. పార్టీ ఏం చేసినా రైటే అని నమ్మే జనాభా వీరు. తక్కిన 70శాతం మందిలో వీళ్లు ఏం చేసినా రాంగే అనుకునే వాళ్లు 30శాతం ఉంటే 40శాతం మంది తటస్థంగా ఉంటూ, సొంత అభిప్రాయాలు కలిగి ఉంటారు.

రాజకీయాలతో సంబంధం ఉన్నా, సమాజంలో పలుకుబడి ఉన్నా నేరస్తులు తప్పించుకో గలుగుతున్నారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. పోలీసుల ప్రతాపం ఎంతసేపూ అర్భకుల మీదే కానీ, పెద్దవాళ్ల జోలికి వెళ్లరు అనేది కూడా నమ్మసాగారు. ఇలా ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిన జనాలు ఏదైనా రేప్ కేస్ జరిగినప్పుడు, మీడియా అందించిన వార్తలు చదివి ఉద్రిక్తులై ‘నిందితుణ్ని ఉరి తీయాలి, యావజ్జీవం చాలదు.’ అని నినాదాలు యిచ్చేస్తారు. సాక్ష్యాలూ, సంపన్నాలూ, వాదోపవదాలూ ఏవీ అక్కర్లేదు వాళ్లకి. దానిలో పెద్ద తలకాయల ప్రమేయం లేకపోతే ఇదే అదనని పోలీసులు రెచ్చిపోయి, తక్షణ‘న్యాయం’ అమలు చేసేసి ప్రజల జేజేలు అందుకుంటారు. హైదరాబాదులో ‘దిశ’ కేసు అలాటిదే!

కలకత్తాలో ఆర్‌జి కర్ ఆస్పత్రిలో డాక్టరు అత్యాచారం, హత్య కేసు చూడండి. చివరకు తేల్చిందేమిటి? ఒక్కడే రేప్ చేశాడని! హత్య జరగగానే వాడొక్కడే కాదు, ఆమె సహచర డాక్టర్లు కూడా కలిసి సామూహిక అత్యాచారం చేశారని వార్తలు వచ్చాయి. అవేమైనా రుజువయ్యాయా? అలా అడిగితే వాళ్లు లంచాలిచ్చి తప్పించుకున్నారు అనేస్తారు కొందరు. రాష్ట్రప్రభుత్వంపై నమ్మకం లేదు కాబట్టి సిబిఐను తీసుకుని వచ్చి విచారణ చేయించారు. పలువురు అత్యాచారం చేసినట్లు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ దొరకాలిగా! సెషన్స్ కోర్టు అన్నీ పరిశీలించి, ముద్దాయికి యావజ్జీవం విధిస్తే, సిబిఐ ‘అబ్బే, అది చాలదు, ఉరిశిక్ష వేయండి’ అంటూ హైకోర్టుకి వెళ్లింది. హైకోర్టేమో, యిది గ్యాంగ్ రేప్ కాదని ముందు మమ్మల్ని కన్విన్స్ చేయండి అంది. నా ప్రశ్నేమిటంటే, రేప్ కేసులన్నిటిలో ఉరి వేస్తున్నారా? రేప్ అనేది హీనమైన చేష్ట. డాక్టర్ను చేసినా, పల్లెటూరి పిల్లను చేసినా, పూజారి కూతుర్ని చేసినా, నడి వయసు గృహిణిని చేసినా – అపరాధం ఒక్కటే కదా! రేప్‌కు శిక్ష ఉరి అని చట్టం చేస్తే సరి!

ఈ ఒక్క కేసులోనే సిబిఐ అలా అడగడం దేనికి? తక్కినవారిని తప్పించి, యీ ముద్దాయి ఒక్కడి మీదకే మొత్తం నెట్టేసి, ఉరి తీయించేస్తే ప్రజాగ్రహం చల్లారి తక్కిన వాళ్ల జోలికి వెళ్లరనా? దాని గురించి పెద్ద రగడ జరిగింది కాబట్టే యీ జాగ్రత్తా? రగడ జరగకపోతే ఏ పదేళ్ల జైలుశిక్ష తోనే సరిపెట్టేసినా ఊరుకునేదా? బాధిత కుటుంబం ఉరికి మించిన శిక్ష కూడా అడగవచ్చు. కానీ సిబిఐ అడగడమేమిటి? పబ్లిక్‌లో గగ్గోలు పుట్టింది కాబట్టి, దాన్ని తృప్తి పరచడానికి సిబిఐ కూడా గ్యాలరీకి ప్లే చేస్తోందా? కలోజియం స్టేడియం గ్యాలరీలలో కూర్చున్న రోమన్ జనసమూహాలను తృప్తి పరచడానికి పాలకులు గ్లేడియేటర్ షోలు అనుమతించేవారు. ఒకరినొకరు ఓడిస్తే సరిపోదు, పొడుచుకుని చంపుకోవాలి అని మాబ్ డిమాండ్ చేసేది. ప్రదర్శకులు అలా చేయిస్తే కేరింతలు కొట్టేది. అలాగే క్రైస్తవమత వ్యాప్తిని రోమన్లు అడ్డుకునే రోజుల్లో పాలకులు క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేసి, గ్యాలరీ ప్రజలను ఉత్సాహ పరిచేవారు.

జూలియస్ సీజర్‌ను కొందరు సెనేటర్లు సామూహికంగా హత్య చేసినప్పుడు, ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. హంతకుల ముఠా నాయకుడైన బ్రూటస్ అంత్యక్రియల సమయంలో ‘సీజర్ రోమ్‌కి ఎంత ద్రోహం చేశాడో, ప్రజాస్వామ్య పరిరక్షణకు అతని హత్య ఎంత అవసరమో’ ఆవేశంగా మాట్లాడి హత్య చేయడం నేరం కాదని ప్రజల్ని నమ్మించాడు. అతని తర్వాత ప్రసంగించిన మార్క్ ఏంటోనీ ‘సీజర్‌కు ఆ శిక్ష పడాల్సిందే, రోమ్‌ను, రోమన్లను అమితంగా ప్రేమించినందుకు..’ అంటూ చాకచక్యంగా ప్రసంగించి, హత్య నేరమే, ఘోరమే అని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాడు. వెంటనే రోమ్ ప్రజలు హంతకులపై తిరగబడి, వాళ్లు దొరక్కపోతే వాళ్ల యిళ్లు తగలబెట్టారు.

ఇక్కడ మనం గమనించ వలసిన దేమిటంటే, పబ్లిక్ పెర్‌సెప్షన్‌ను నువ్వు ఎలా మోల్డ్ చేయగలిగావు అనేది ముఖ్యం. ఫలానావాడు నేరం చేశాడు, వాడికి యీ శిక్ష తగును అనే భావాన్ని వాళ్లలో కలిగించాలి. అప్పట్లో మీడియా లేదు. కేవలం ప్రసంగాలతోనే ప్రజలను తమ వైపు తిప్పుకునేవారు. రోమ్ నాయకులందరూ వక్తృత్వంలో నెలల తరబడి తర్ఫీదు పొందేవారు. ఏదైనా కుక్కను కాల్చి చంపాలంటే దానిపై పిచ్చిది అనే ముద్ర వేసి, జనాల్ని నమ్మించాక అప్పుడు కాలిస్తే ఎవడూ ఏమనకపోగా సంతోషిస్తారు కూడా. చంపేదాకా తీసుకుపోకుండా ఏదైనా శిక్ష వేద్దామనుకుంటే, అది సబబే అని పబ్లిక్‌ను నమ్మించగలగాలి. అలాటి నేరేటివ్‌ను ప్రజల్లో బిల్డప్ చేయగలగాలి. లేకపోతే ఇది నేరానికి తగిన శిక్ష కాదు, నేరానికి వేస్తున్న శిక్ష కాదు, మనసులో ఏదో పెట్టుకుని కక్ష సాధిస్తున్నారు అనే అభిప్రాయం పబ్లిక్‌లో కలుగుతుంది. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనబడాలి కూడా అని కోర్టుల విషయంలో అన్నది ప్రభుత్వం విషయంలో కూడా వర్తిస్తుంది.

పోసాని విషయంలో ప్రభుత్వం ఆ జాగ్రత్త పడలేదనిపిస్తుంది. పోసాని అతిగా, అసభ్యంగా మాట్లాడి నేరం చేశాడు అని అందరూ ఫీలయ్యారు. దానికి తగుపాటి శిక్ష పడి ఉంటే అతను దానికి అర్హుడే అనుకుని ఊరుకునే వారు. కానీ నేరం మోతాదు కంటె శిక్ష మోతాదు ఎక్కువ కావడంతో అతనిపై జాలి కలగడం మొదలైంది. ఇది వాంఛనీయం కాదు. నేరస్తుడిపై ప్రజలకు జాలి కలిగితే న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మంచిది కాదు. పోసానికి ఒక తిక్క మనిషి. పోసోనికి అరవై ఏళ్లు వచ్చినా ఆరేళ్ల పసిబాలుడి తంతే అని ఆయన గురువు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పోసానికి పబ్లిక్‌లో ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో తెలియదు. కాలేజీలో హింసకు దిగానని, గురువుగారి భార్యను పొడిచి చంపేద్దామనుకుని చెప్పి సాధించిందేమిటి? తనకు నచ్చినవాణ్ని ఆకాశానికి ఎత్తడం, నచ్చనివాణ్ని పడతిట్టడం.. వీటివలన ఆయన లాభపడినది ఏమీ లేదు.

నిజానికి పోసాని కమిట్‌మెంట్ వున్నవాడు. టిడిపిని, చంద్రబాబుని అభిమానించే రోజుల్లో వాళ్లకి ఓటేయమని సొంతడబ్బుతో పేపర్లలో యాడ్స్ యిచ్చేవాడు. తర్వాత చిరంజీవిపై నమ్మకంతో ప్రజా పార్టీలో చేరి ఎన్నికలలో నిలబడి ఓడిపోయాడు. ఇటీవలి కాలంలో మోదీని, జగన్‌ను, కెసియార్‌ను ఏకకాలంలో యిష్టపడ్డాడు. పబ్లిగ్గా ప్రశంసలు కురిపించాడు. నచ్చనివాళ్లను పడతిట్టాడు. పవన్, బాబు, లోకేశ్‌లను తిట్టాడు కాబట్టే యిప్పుడీ అవస్థలు పడుతున్నాడు అంటున్నారు కానీ ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, ఈనాడు రామోజీని కూడా తిట్టాడు. ఇప్పుడీ కేసుల వెనక వారి ప్రోద్బలమెంత వుందో బయటకు రాలేదు. పవన్ విషయంలో యీయన తిట్టడానికి ముందు అతని అనుచరులు సోషల్ మీడియాలో ఆయన్ని, ఆయన కుటుంబాన్ని నానా మాటలూ అన్నారట. ఈయన వాళ్లని తిరిగి తిట్టడంతో ఆగి వుంటే సరిపోయేది, మూల పురుషుడు పవనే అంటూ రెచ్చిపోవడంతో, హద్దు మీరడంతో ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది.

కానీ పోసాని ఒకడేనా రెచ్చిపోయినది? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి, అక్కడి రాజకీయాల్లో అసభ్యత రాజ్యమేలుతోంది. ఎవరు ముందు మొదలుపెట్టారు, ఏ మోతాదులో అన్నారు, తిరిగి ఏ మోతాదులో పడ్డారు అనేది పరిశోధించడం మొదలుపెడితే, దారీ తెన్నూ తోచక అయోమయమై పోతాం. అందరూ దోషులే. నిజానికి అందరి కంటె ఎక్కువగా తప్పు పట్టాలంటే వల్లభనేని వంశీని పట్టాలి. ఒక యిల్లాలి శీలం గురించి ఘోరంగా మాట్లాడాడు. తర్వాత క్షమాపణ చెప్పినా అది తప్పే. దానిపై వెంటనే లోకేశ్, బాబు కోర్టుకి వెళ్లి తేల్చుకోకుండా రాజకీయంగా వాడుకున్నారు. అయితే యిక్కడ ప్రశ్న ఏమొస్తోందంటే, సదరు వ్యక్తి వలన బాధ పడిన, భంగపడిన వ్యక్తి ఫిర్యాదు చేయాలా? వేరే ఎవరైనా చేసేయవచ్చా?

ఇప్పటిదాకా పరువునష్టం దావాలలో పరువు పోయిందని బాధ పడిన వ్యక్తులే కేసు పెడుతూ వచ్చారు. కానీ ఆంధ్రలో కూటమి ప్రభుత్వం యిప్పుడు కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. ఎ బిని తిడితే, సంబంధం లేని సి బయలుదేరి బిని అలా అనడం వలన నా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ఫిర్యాదు చేయడం, పోలీసులు దానిపై కేసు పెట్టడం జరుగుతోంది. ‘‘ఢీ’’ సినిమాలో బ్రహ్మానందానికి హీరో అనుచర బృందంతో కలిసి, సునీల్‌ను టీజ్ చేసే అవకాశం వస్తుంది. సునీల్ ఏదో సినిమా డాన్సు చేయగానే ‘నేను ఆ యాక్టర్ ఫ్యాన్‌ని, యితనిలా అనుకరించడంతో హర్ట్ అయ్యాను’ అంటూ అభ్యంతర పెడతాడు హీరో ఫ్రెండ్. చివరకు ఓ హిందీ పాటకు చేసినా ‘నేను హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటుని. దీనికీ హర్ట్ అయ్యాను.’ అంటాడు. హృతిక్ రోషన్‌కు ఆంధ్రలో ఫ్యాన్ అసోసియేషనా? అని సునీల్ ఆశ్చర్యపడ్డా ప్రయోజనం ఉండదు.

అదంతా కామెడీ అనుకుని నవ్వుకున్నవాళ్లం యిప్పుడు ఆంధ్ర ప్రభుత్వం అదే సాకు చెప్పడం చూసి ఆశ్చర్యపడుతున్నాం. రామ్ గోపాల్ వర్మ అనేక మంది టిడిపి నాయకులపై సెటైర్లతో సినిమాలు తీసి, వాళ్ల పరువు తీయడానికి ప్రయత్నించాడు. దానికి గాను, బాబో, లోకేశో డైరక్టుగా కేసులు పెట్టి క్షమాపణ చెప్పమని అడగడమనేది పద్ధతి. అలా కాకుండా ఎవరో మూడో వ్యక్తి తన మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఫిర్యాదు చేశాడు. వర్మ దీన్నే ప్రశ్నించాడు, యిది చట్టబద్ధమా? అని. గతంలో పాటలోనో, పేరులోనో కుల ప్రస్తావన వస్తే ‘ఆ పర్టిక్యులర్ కుల సంఘం వాళ్లం, యిది మాకు అవమానకరం’ అంటూ కొందరు అభ్యంతర పెట్టడాలూ, చర్చకు దిగడాలూ జరిగేవి.

ఇక్కడ కులమూ, మతమూ, చుట్టరికమూ ఏదీ ఫ్యాక్టర్ కాదు. ఆ వ్యక్తిపై అభిమానమట, మనోభావాలు దెబ్బ తిన్నాయట. అసలు వ్యక్తి మనసు గాయపడిందో లేదో, యీ వ్యాఖ్యలు పట్టించుకున్నాడో, నవ్వేసి ఊరుకున్నాడో పోలీసులు వెళ్లి అడిగారా? అతను వచ్చి సాక్ష్యం చెప్తాడా? నేను గతంలో కర్ణుణ్ని దుష్టచతుష్టయంలో ఒకడిగా ఎందుకు పరిగణిస్తారో విపులంగా వ్యాసం రాస్తే ఒక పాఠకుడు కర్ణుడు మంచివాడే అని వాదిస్తూ మెయిల్స్ రాశారు. చివరకు నేను మహాభారతంలోంచే రాశానంటూ ఆ పేజీలు స్కాన్ చేసి పంపించాను. ఇప్పటి వాతావరణంలో అయితే ‘కర్ణుడి విషయంలో నా మనోభావాలు దెబ్బ తిన్నా’యంటూ ఆయన నాపై కేసు పెట్టేవారేమో! ఔరంగజేబు సమాధి ఆంధ్రలో ఉంటే, దాన్ని కూల్చేస్తాననడం చేత నా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఎవరైనా ఫిర్యాదు చేసేవారేమో!

పోసానిపై పవన్ డైరక్టుగా కేసు పెట్టి, క్షమాపణ కోరమని అడిగి వుంటే సవ్యంగా ఉండేది. ఎవరెవరో ఫిర్యాదులు చేయడమేమిటి? ఈయనను తీసుకెళ్లి జైల్లో పెట్టడమేమిటి? మామూలుగా అయితే లాయరు నోటీసులు పంపిస్తారు, మా ఉద్దేశం అది కాదు అంటూ వీళ్లేదో సమాధానం యిస్తారు. ఈ చర్చ తర్వాత కేసు, కస్టడీ, బెయిలు, విచారణ… యివన్నీ జరుగుతాయి. పోసాని విషయంలో ఏం చేశారు? ఎవరో ఫిర్యాదు చేయగానే తీసుకెళ్లి అరెస్టు చేశారు. అంతకంటె ఘోరమేమిటంటే, కేసుకి అన్వయించని సెక్షన్లతో ఎఫ్ఐఆర్‌లు కట్టారు. పోసాని ప్రొఫెషనల్ క్రిమినల్.. అనీ మరోటనీ. వీటికి ఆధారాలున్నాయా, కోర్టులో నిరూపితమౌతాయా అనే చింతే లేదు పోలీసులకు. ప్రస్తుతం జైల్లో పెట్టామా లేదా, పాలకులను తృప్తి పరచామా లేదా అనేదే వాళ్ల లెక్క. ఒక కేసులో బెయిలు రాగానే మరో ఊళ్లో కేసు పెట్టించి, అక్కడకు తోలడం, అక్కడ కస్టడీ, బెయిలు. ఇలా 19 కేసులు పెట్టి ఊరూరూ తిప్పి ఒళ్లు హూనం చేశారు. ప్రస్తుతానికి బెయిలు వచ్చినట్లుంది. కానీ రేపు ఇచ్ఛాపురంలో మరో కొత్త కేసు, ఎల్లుండి తడలో యింకో కొత్త కేసు పెట్టి మళ్లీ తిప్పవచ్చు.

తనకు ఆరోగ్యం బాగా లేదని, సౌకర్యాలున్న కాస్త పెద్ద జైల్లో పెట్టమని పోసాని అడిగితే, సాకులు చెప్తున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు అని తెలుగు మీడియా రాసింది. 70వ పడిలో పడినవాడు, హార్ట్ సర్జరీ జరిగినవాడు అలా వేడుకోవడంలో ఆశ్చర్యమేముంది? అతనే కనుక టిడిపి పార్టీవాడికి చెందినవాడై ఉంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో వున్నా, యీపాటికి రమేశ్ వంటి ప్రయివేటు ఆసుపత్రిలో చేరేందుకు కోర్టులు అనుమతించి ఉండేవి. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నపుడు దోమలు కుట్టకపోయినా, ఫ్యాన్సు జోరుగా తిరగకపోయినా.. అవన్నీ పెద్ద పాయింట్లు. ఇప్పుడు పోసాని కిమ్మనకూడదు. చంద్రబాబు చివరిదాకా బెయిలు అడగకుండా, కేసు క్వాష్ చేయాలని వాదిస్తూ తన జైలువాసాన్ని పొడిగించుకున్నారు. చివరకు యిక లాభం లేదని అనారోగ్య కారణాలు చెప్పి బెయిలు అడిగితే తక్షణం వచ్చింది. పోసాని తొలి రోజు నుంచి బెయిలు అడుగుతూనే ఉన్నాడు.

చంద్రబాబు జైల్లో ఉన్నపుడు కొందరు ఐఏఎస్‌లు ప్రజాస్వామ్య పరిరక్షకులమంటూ సంఘంగా ఏర్పడి, అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టేశారు. ఇప్పుడు పోసానిపై కేసులపై కేసులు పెట్టి, తప్పుడు సెక్షన్లు పెట్టి తిప్పడం వారికి ప్రజాస్వామిక చర్యగా కనబడుతోందా? వైసిపి హయాంలో అక్రమాలపై గళమెత్తిన వారు, యిప్పుడూ గళమెత్తాలి. మనోభావాల పేరుతో యీ కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించాలి. ఊరూరా పెట్టిన అన్ని కేసులను క్లబ్ చేసి ఒకే చోట విచారించాలని సూచించాలి. కానీ వారంతా మౌనముద్ర వహించారు. పోసాని ఒకర్ని దూషించాడు. అవతలి వ్యక్తి హర్ట్ అయి వుంటే, వెంటనే రియాక్ట్ కావాలి. అలా కాకుండా కొన్నేళ్ల తర్వాత, అతనితో సంబంధం లేని వ్యక్తి తన మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ (అఫెండెడ్) కేసు పెట్టడమనేది హాస్యాస్పదం. అలాటివి ఊరూరా పెట్టి, జైళ్లు మారుస్తూ తిప్పడమనేది హెరాస్‌మెంట్ క్రిందకు వస్తుందని యీ ప్రజాస్వామ్య యోధులకు తోచలేదా?

‘‘ఇండియా గాట్ లేటేంట్’’ అనే యూట్యూబ్ షో ఉంది. 2025 ఫిబ్రవరి 18 నాటి ఎపిసోడ్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ దాని నిర్మాతలపై, నటీనటులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. అప్పుడు ‘‘హిందూ’’ ‘ఈజ్ దేర్ ఏ రైట్ టు టేక్ అఫెన్స్?’ పేర జస్టిస్ గౌతమ్ పటేల్ (బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి), దుష్యంత్ దవే (అడ్వకేట్)ల మధ్య చర్చ పెట్టింది. జస్టిస్ పటేల్ చెప్పినదేమిటంటే – ఏదైనా ప్రసంగం, మాట వలన అఫెండ్ కావడానికి రాజ్యాంగంలో హక్కేమీ లేదు. ఫ్రీ స్పీచ్‌కు ఆర్టికల్ 19(2) క్రింద కొన్ని పరిమితులున్నాయి. కానీ అఫెన్సివ్ స్పీచ్ అంటూ ప్రత్యేకమైన కేటగిరీ లేదు. ఫ్రీ స్పీచ్ అనేదానికి విస్తృతమైన పరిధి ఉంది. (ఎక్స్‌పాన్సివ్) కానీ దానిపై నియంత్రణను చాలా పరిమితంగా నిర్వచించారు. (నారోలీ డిఫైన్‌డ్). ప్రజల సెంటిమెంట్ల బట్టి కాకుండా, యీ పరిమిత లీగల్ పెరామీటర్స్ బట్టి నేరాన్ని అంచనా వేయాలి.

దుష్యంత్ దవే ఏమన్నారంటే – స్వేచ్ఛగా మాట్లాడే హక్కుకి డీసెన్సీ, మొరాలిటీ అనే హద్దులున్నాయి కానీ ఆ హద్దులు మీరడం క్రిమినల్ అఫెన్స్ క్రిందకు రాదు. ఆ ప్రసంగం హింసకు ప్రేరేపించినా, దేశద్రోహానికి ప్రేరేపించినా అప్పుడు చర్య తీసుకోవచ్చు. అలాటి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా, తర్వాత పత్రికల్లో విమర్శించడం ద్వారా సమాజం తన నిరసనను తెలియపరచవచ్చు. ప్రభుత్వం కేసులు పెట్టడం పరిష్కారం కానే కాదు. ఒకే నేరానికి అనేక చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్ చేయడం హెరాస్‌మెంట్ క్రింద వస్తుంది.

బూతులనేవి (ప్రొఫేనిటీ) అశ్లీలం (అబ్‌సీనిటీ) క్రిందకు వస్తాయా రావా అనేది కూడా వీరిద్దరూ చర్చించారు. బూతులున్నంత మాత్రాన అశ్లీలం అనలేమని జస్టిస్ పటేల్ అన్నారు. 1964లో ‘‘లేడీ చాటర్లీస్ లవర్’’ పుస్తకం గురించి వచ్చిన కేసులో సుప్రీం కోర్టు విక్టోరియా శకం నాటి స్టాండర్డ్స్ కొలబద్దగా తీసుకుని, అశ్లీలంగా పరిగణించి, దాన్ని బ్యాన్ చేసింది. 50 ఏళ్లు పోయాక అవీక్ సర్కార్ వెర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో అశ్లీలతకు ‘కమ్యూనిటీ స్టాండర్డ్స్’ అప్లయి చేయాలి అని చెప్పింది. ఆ స్డాండర్డ్స్ స్థిరంగా ఉండవు, నిర్వచించడం కష్టం.’ అన్నారాయన. అది నిజమే ఒకప్పుడు ‘వెంట్రుక ముక్క బరాబర్’, ‘ఏం పీకుతావు?’ ‘నీ అమ్మ మొగుడిదా?’ వంటివి పబ్లిగ్గా అనేవారు కాదు. కానీ యిప్పుడవి ప్రజానాయకులే అనేస్తున్నారు. దుష్యంత్ దవే మాట్లాడుతూ ‘అశ్లీలమనేదేమిటో క్రిమినల్ లాలో కానీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లో కానీ స్పష్టంగా నిర్వచించ బడలేదు. బూతులు మాట్లాడడం హాస్యం కాదు. వాటిని పరిహరించాలి.’ అన్నారు.

ఇదంతా చదివితే పోసానిని అసభ్యత, అశ్లీలత క్రింద శిక్షించడం కష్టమని, అతని మాటల వలన హింస చెలరేగిందనో, దేశప్రయోజనాలకు విఘాతం కలిగిందనో నిరూపిస్తే తప్ప కేసులు నిలవవని, బెయిలు సులభంగా వచ్చేస్తుందని పోలీసు వాళ్లకు కూడా తెలిసే, సంబంధం లేని పెద్ద పెద్ద సెక్షన్ల క్రింద పెట్టినట్లున్నారు. ఒకటీ రెండు కేసులు పెడితే పోసాని వాచాలతకు తగిన శిక్ష పడిందని జనాలు అనుకుని ఊరుకునే వారు. ఇన్ని కేసులు పెట్టి దాదాపు 25 రోజులు ఊరూరూ తిప్పడంతో, మరీ యింత శిక్షా? అనిపించి, అతనిపై సింపతీ కలగసాగింది. ఈ ప్రక్రియ చేపట్టే ముందే పోసాని గురించి చెడుగా టిడిపి, జనసేనలు అబద్ధాలో, సబద్ధాలో ప్రచారంలో పెట్టి ఉంటే ప్రజలకు జాలి కలిగేది కాదు. ఆ గ్రౌండ్‌వర్క్ చేయకుండా యిలా చేయడం కౌంటర్ ప్రోడక్టివ్ అయి, ‘కక్ష సాధింపు’ కేటగిరీలోకి చేరిందని నా అభిప్రాయం. రోజా, అంబటి విషయంలో యీ ముందు జాగ్రత్త తీసుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనా నోటిని అదుపులో పెట్టుకోవడం ఎంత అవసరమో పోసాని ఉదంతం చాటిచెప్పింది.

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

98 Replies to “ఎమ్బీయస్‍: నేరమూ – శిక్షా”

  1. పోసాని కమిట్మెంట్ వున్నవాడు అంటావు, మళ్ళీ నువ్వే ఆరేళ్ళ బాలుడు అంటావ్. వాడిలో కమిట్మెంట్ ఏముందో నాకు కన్పించలేదు. ఈ ఎండకి ఆ గొడుగు పట్టే రకం. గ్రామాలలో పది రూపాయాలు సారా త్రాగించి ప్రత్యర్థులను తిట్టమంటే తిట్టే వాళ్ళు కొందరుంటారు. వీడు ఆ రకం.

  2. same, aa Pastor Praveen case kuda …. CCTV lo clear ga , he is in Intoxicated ga undi.

    Dupe ni pettaarani , dress marchesaarani , evaro chase chesaru ani .. kavalani Govt dachestundi ani evevoo.. stories.

  3. ఎవరో మా అభిమాన రచయితను కించ పరుస్తున్నారు. ఎడిటర్ క్షమాపణ చెప్పాలి..😄

  4. @writer : except people like you, political party sympathizers, a normal, decent people – have no sympathy for Posani. He has crossed every line of human divinity. He is a well educated. He knew what he was talking.

    coming to the cases: except YCP followers – common people felt – those cars were even less- public expected more punishment Than given.

    with this – you have complete lost the humanity by saying “his crime was less” – God bless you.

  5. పేరు చివర మోడీ అని ఉన్నవాళ్లు అందరు తప్పించుకుని దేశం వొదిలి వెళ్తున్నారు అని నిరవ్ మోడీ,లలిత్ మోడీ లని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకి రాహుల్ గాంధీ కి ఎంపీ పదవి పోయింది కదా మరి అప్పుడు జస్టిస్ గౌతమ్ పటేల్ (బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి), దుష్యంత్ దవే (అడ్వకేట్) ఎక్కడ ఉన్నారు ?

  6. ఇక్కడ అసలు విషయం పోసాని కాదు .. చేతకాని లేదా పట్టించుకోని వైసీపీ పార్టీ. ఇంతకంటే ఎంతో ఘోరంగా ప్రవర్తించిన టీడీపీ వాళ్లని ఆ పార్టీ సమర్థవంతంగా కాపాడుకోవడమే కాకుండా గట్టిగా వెనుకేసుకొని వచ్చింది ఇంకా మాట్లాడితే ఎదురు రుబాబు చేసింది ..వైసీపీ అధికారంలో వుండికూడా ఏమిచేయలేక చేతులు ఎత్తేసింది .. ఎదురు నష్టపోయింది .. పార్టీని ఒక వ్యవస్థలాగ కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడపడం వల్ల వచ్చిన అవస్థ ఇది .. ఇంత జరిగినా ఇంకా ఏమాత్రం మార్పులేకుండా అలాగే సాగిపోతున్నారు చూడండి అది మూర్ఖత్వం అంటే

  7. రఘు రామ కృష్ణం రాజు , పోసాని లాగ అసభ్యంగా మాట్లాడలేదు కదా మరి ఎందుకు లాక్కెళ్లి కొట్టారు జగన్ & కో బ్యాచ్ ? అప్పుడు ఎక్కడికి పోయాయి ఈ నీతులు ?

  8. పోసాని పట్ల సింపతి చూపించటం అంటే అలాంటి వాడు పోసాని కన్నా పెద్ద వెధవ అని.. పోసాని కేవలం పవన్‌కళ్యాణ్ ని మాత్రమే తిట్టి ఉంటే రాజకీయాల్లో సహజం అని సరిపెట్టుకునేవాళ్లు. అధికారం ఉన్నదన్న మదం ఒళ్లంతా ఎక్కి, 90 ఏళ్ల వృద్ధురాలిని, 10-15 ఏళ్ల చిన్నపిల్లల్ని కూడా నీచంగా తిట్టాడు. తమరు సలహా ఇచ్చినట్లు ఆ రోజే ఈ కేసులు పెట్టి ఉంటే పోలీసులు ఏం చేసేవాళ్లో జగన్ పాలన చూసిన రాష్ట్రం మొత్తానికి తెలుసు. కేసులు పెట్టిన వాళ్లనే జైల్లో పెట్టేవాళ్లు. కాబట్టి ఏదో పెద్ద లా పాయింటు లాగినట్లు అప్పుడు లేని మనోభావాలు ఇప్పుడెలా వచ్చాయి అని అడగటం అతితెలివి ప్రదర్శనకి తప్ప ఇంక దేనికీ ఉపయోగపడదు

  9. పోసాని పట్ల సింపతి చూపించటం అంటే అలాంటి వాడు పోసాని కన్నా పెద్ద వె!ధవ అని.. పోసాని కేవలం పవన్‌కళ్యాణ్ ని మాత్రమే తిట్టి ఉంటే రాజకీయాల్లో సహజం అని సరిపెట్టుకునేవాళ్లు. అధికారం ఉన్నదన్న మదం ఒళ్లంతా ఎక్కి, 90 ఏళ్ల వృద్ధురాలిని, 15 ఏళ్ల చిన్నపి!ల్లల్ని కూడా నీ!చంగా తిట్టాడు. తమరు సలహా ఇచ్చినట్లు ఆ రోజే ఈ కేసులు పెట్టి ఉంటే పోలీసులు ఏం చేసేవాళ్లో జగన్ పాలన చూసిన రాష్ట్రం మొత్తానికి తెలుసు. కే!సులు పెట్టిన వాళ్లనే జై!ల్లో పెట్టేవాళ్లు. కాబట్టి ఏదో పెద్ద లా! పాయింటు లాగినట్లు అప్పుడు లేని మనోభావాలు ఇప్పుడెలా వచ్చాయి అని అడగటం అతితెలివి ప్రదర్శనకి తప్ప ఇంక దేనికీ ఉపయోగపడదు

  10. పోసాని పట్ల సింపతి చూపించటం అంటే అలాంటి వాడు పోసాని కన్నా పెద్ద వె!ధవ అని.. పోసాని కేవలం పవన్‌కళ్యాణ్ ని మాత్రమే తి!ట్టి ఉంటే రాజకీయాల్లో సహజం అని సరిపెట్టుకునేవాళ్లు. అధికారం ఉన్నదన్న మ!దం ఒళ్లంతా ఎక్కి, 90 ఏళ్ల వృద్ధురాలిని, 15 ఏళ్ల చిన్నపి!ల్లల్ని కూడా నీ!చంగా తిట్టాడు. తమరు సలహా ఇచ్చినట్లు ఆ రోజే ఈ కే!సులు పెట్టి ఉంటే పోలీసులు ఏం చేసేవాళ్లో జగన్ పాలన చూసిన రాష్ట్రం మొత్తానికి తెలుసు. కే!సులు పెట్టిన వాళ్లనే జై!ల్లో పెట్టేవాళ్లు. కాబట్టి ఏదో పెద్ద లా! పాయింటు లాగినట్లు అప్పుడు లేని మనోభావాలు ఇప్పుడెలా వచ్చాయి అని అడగటం అతితెలివి ప్రదర్శనకి తప్ప ఇంక దేనికీ ఉపయోగపడదు

  11. పోసాని పట్ల సింపతి చూపించటం అంటే అలాంటి వాడు పోసాని కన్నా పెద్ద వె!ధవ అని.. పోసాని కేవలం పవన్‌కళ్యాణ్ ని మాత్రమే తి!ట్టి ఉంటే రాజకీయాల్లో సహజం అని సరిపెట్టుకునేవాళ్లు. అధికారం ఉన్నదన్న మ!దం ఒళ్లంతా ఎక్కి, 90 ఏళ్ల వృద్ధురాలిని, 15 ఏళ్ల చి!న్నపి!ల్లల్ని కూడా నీ!చంగా తిట్టాడు. త!మరు సలహా ఇచ్చినట్లు ఆ రోజే ఈ కే!సులు పెట్టి ఉంటే పోలీ!సులు ఏం చేసేవాళ్లో జగ!న్ పాలన చూసిన రాష్ట్రం మొత్తానికి తెలుసు. కే!సులు పెట్టిన వాళ్లనే జై!ల్లో పెట్టేవాళ్లు. కాబట్టి ఏదో పెద్ద లా! పాయింటు లాగినట్లు అప్పుడు లేని మనోభావాలు ఇప్పుడెలా వచ్చాయి అని అడగటం అతితెలివి ప్రదర్శనకి తప్ప ఇంక దేనికీ ఉపయోగపడదు

  12. పోసాని పట్ల సింపతి చూపించటం అంటే అలాంటి వాడు పోసాని కన్నా పెద్ద వె!ధవ అని. త!మరు సలహా ఇచ్చినట్లు ఆ రోజే ఈ కే!సులు పెట్టి ఉంటే పోలీ!సులు ఏం చేసేవాళ్లో జగ!న్ పాలన చూసిన రాష్ట్రం మొత్తానికి తెలుసు. కే!సులు పెట్టిన వాళ్లనే జై!ల్లో పెట్టేవాళ్లు. కాబట్టి ఏదో పెద్ద లా! పాయింటు లాగినట్లు అప్పుడు లేని మనోభావాలు ఇప్పుడెలా వచ్చాయి అని అడగటం అతితెలివి ప్రదర్శనకి తప్ప ఇంక దేనికీ ఉపయోగపడదు

  13. పోసాని పట్ల సింపతి చూపించటం అంటే అలాంటి వాడు పోసాని కన్నా పెద్ద వె!ధవ అని..

  14. ప్రసాద్ గారు ఎంతటి వైసీపీ సమర్థకులైనా, పోసాని పట్ల ఇంతటి సానుభూతి అనవసరం అని నా అభిప్రాయం. అతన్ని అతడి తల్లితండ్రులు చిన్నతనంలోనే దండించి ఉంటే అతడికి సత్ప్రవర్తన అలవాటు అయ్యి ఉండేది. ఇప్పుడు అతడికి జరిగిన సన్మానంతో అతడొక్కడికే కాదు అతని బాటలో నడచి జగన్ మనసుని దోచుకోవాలనుకునే అనేక మంది నాయకులకి కూడా బుద్ధి వస్తుంది. మరోసారి నాయకుల భాషలో కొంతైనా సంస్కరణ వస్తుంది.

    1. Ve edo writer anu kuntaadu kani me ntal la nja kod uku…anni vee sike tel usu anuku ntaadu…tel aka pally, Nageshwar rao laga

      ….kod erri puk ulu ante…..Andh ra droh ulu

      ..

    2. పోసానికి ‘సన్మానం’ చేసే ప్రయత్నంలో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడమే అభ్యంతరకరం. హెరాస్‌మెంట్ జరుగుతోంది అనే ఫీలింగు జనాల్లో కలగడం ప్రమాదకరం. నేరమూ శిక్షా సమాన స్థాయిలో వున్నాయా అనే ప్రశ్నలేవనెత్తాను నేను. దుర్భాషలాడే ఎవరిపైనా నాకు సానుభూతి లేదు. అసభ్యాంధ్ర అని పెద్ద ఆర్టికలే రాశాను. ‘జగన్ మనసుని దోచుకోవాలనుకునే నాయకులకు మాత్రమే బుద్ధి రావాలా?’ బాబు మనసు, పవన్ మనసు దోచుకోవాలనుకుని దుర్భాషలాడిన వారి సంగతేమిటి?

      1. బాబు మనసు దోచుకోవాలి అని .. ఏ నాయకుడు ప్రతిపక్ష పార్టీ ఇంట్లో ఆడవాళ్ల శిలలా మీద మాట్లాడారో ఒక సారి పరిశోధించి రాయండి ..అసెంబ్లీ లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎప్పుడు మొదలు పెట్టారో కూడా పరిశోదించండి … తమిళ్ రాజకీయాలు తెలిసిన మీకు తెలియనివి కావు ఇవి …

  15. పోసాని గారి మీద సానుభూతి రావడానికి అయిన చేసిన వ్యాఖ్యలు ఏమి మహా భారత ప్రవచనాలు కాదు ప్రసాద్ గారు సభ్యత ఉన్నవాళ్ళు ఎవ్వరు వాటిని సమర్థించారు..

    1. నేనూ సమర్థించను, సమర్థించలేదు. నేరమూ శిక్షా సమాన స్థాయిలో వున్నాయా అనేదే ప్రశ్న.

      1. ఆయనకి ఇంకా శిక్ష పడలేదు అండి ..విచారించడానికి తీసుకునే వెళ్తే ఆది శిక్ష ఎలా అవుతుంది .. దానికి ఇంత పెద్ద వ్యాసాలు అక్కర్లేదు .. మరొక మాట .. ఎవరినో అంటే వేరే వాళ్ళు ఎలా కేసు లు పెడతారు అన్నారు .. మరి ఎవరో సోషల్ మీడియా అభిమానులు పోస్ట్లు పెడితే ఈయన ఎందుకు పవన్ గారిని డైరెక్ట్ గ తిట్టడం .. ఒక సరి ఆలోచించండి ..

      2. ఆయనకి ఇంకా శిక్ష పడలేదు అండి ..విచారించడానికి తీసుకునే వెళ్తే ఆది శిక్ష ఎలా అవుతుంది ..

      3. మీ ప్రశ్న కి సమాధానం కోర్ట్స్ చూస్కుంటాయి లెండి .. మనం ఎందుకు ఇక్కడ ట్రయల్ రన్ చెయ్యడం ..

        1. కోర్టు ద్వారా తీయించండి. దానికో ప్రొసీజర్ ఉంది. రోమన్ మాబ్‌ల యుగం కాదు కదా యిది!

          1. వివేకా బాబాయ్ ని గొడ్డలితో 7 సార్లు నరికి నరికి నరికి నరికి నరికి నరికి నరికి చంపారు కదా అప్పుడు జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం లో లేడా?

          2. రోమన్ మాబ్‌ల యుగం దాకా ఎందుకు జగన్ రెడ్డి ఫ్యాక్షన్ తీర్పు ఎలా ఉంటాదో మనం కొన్ని కోట్ల కోట్ల ఉదంతాలు చూసాము

  16. people show sympathy on innocent who receive punishment with no fault.

    in Posani case, except YCP supporters, common people not even bothered to look at the cases, they seems relaxed after his arrest and feeling stressed after the bail. I don’t see any sympathy here.

  17. appudu appudu comments pettavallu musalodu ani sambhodistunaru kadaa, adi narrowly defined కిందకి వస్తాయా? vatilani మీరు డిలీట్ చేసుకుంటూ వుంటారు

    1. శిక్ష తప్పదు నిజమే. కానీ యింత శిక్షా? దానికి సమాధానం చెప్పండి

      1. How can you decide? Why should justice system give choice to consolidate all the case and try in one court? Did you ever listen to his abuses? He is a well educated, writer himself – so he did all this with complete conscience- was he a teenager when he made these comments? Now suddenly age came to picture? What are trying to prove?

        if I see a guy making nuisance- I can file a complaint even if he is not abusing me – but I am affected by his actions in the public.

      2. నీకూ ఒక కూతురు ఉంది, ఆమె పెరిగి పెద్దదౌతుంది, అప్పటికి నేను బతికే ఉంటాను, నువ్వు గుర్తు పెట్టుకో! – పోసాని మాటలు పవన్ ను ఉద్దేశించి. ఆ మాటలకి అర్థం ఏమిటో, అలాంటి మాటలు మాట్లాడినవాడిపై సానుభూతి ఎందుకో మీరు చెప్పండి?!

        1. నాకు ఏ సానుభూతీ లేదు. ఈ హెరాస్‌మెంట్ వలన అనవసరంగా సానుభూతి కలగవచ్చు అని హెచ్చరిస్తున్నాను. ఆ మాటలకు ఫిర్యాదు చేయవలసినది ఎవరు? అది చెప్పండి. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలి.

          1. ఎవరో సోషల్ మీడియా అభిమానులు పోసాని మీద కామెంట్లు పెడితే ఈయన డైరెక్ట్ గ పవన్ ని తిట్టొచ్చు మరి .. .. మీ వాదన లో లాజిక్ లేదు అండి ..

          2. తిట్టకూడదనే నేనూ రాసాను. చదవండి. కానీ దానికి రియాక్ట్ కావలసినది పవన్ లేదా అతని కూతురు. ఊళ్లో వాడు కాదు

          3. నాయకుడు అనేవాడు ఒక్క మనిషి, ఈ మధ్య కాలంలో శృతి, గతి తప్పి అశ్లీల విమర్శలు చేసేవారి సంఖ్య వందల్లో ఉంటోంది. వాళ్ళందరి వెనక ఒకడే పరిగెట్టాలంటే సాధ్యం అయే పనికాదు, అది జగన్ అయినా, పవన్ అయినా.

        1. వేయించండి, కోర్టు ద్వారా! కానీ యీ తిప్పడాలేమిటి? తప్పుడు సెక్షన్లేమిటి?

          1. కోర్టు దాకా వస్తే అప్పుడు ఏ మేరకు సబబో తెలుస్తుంది. నేను వంత పాడటం లేదని మీరు గమనించాలి. నేరానికి తగిన శిక్ష పడాలనే చెప్తున్నాను. అతి చేస్తే వికటిస్తుంది.

          2. అక్కడ గౌరవ కోర్ట్ వారు పోసాని లాయర్ వాద ప్రతివాదనలు విన్న తరువాత అత్యంత పారదర్శకంగా రిమాండ్ విధించటమయ్యింది అతి చేసిన పోసానికి ఒక చిన్న హెచ్చరిక లాంటిది ఇప్పటికి పోసాని మారకపోతే గౌరవ కోర్ట్ వారు పోసాని కి ఉరి కానీ లేక 14 ఏళ్ళు గాని వేయొచ్చు మనం ఇప్పుడే ఏమి తొందరపడి చెప్పలేము

      3. parledu mana family ni ante kada telisedi .. annattu eve mee neeli l 1 1 ni ante ?

        mari mask adigina … chesina mee neeli l 1 1 , door delivery echina l 1 1 mlc

        appudu mee సమాధానం చెప్పండి

  18. This is a good treatment for the people who abuse our justice system- as they are aware there are no such laws to punish the language they use- So nothing to point out on anything here.

  19. Police booked Posani based on the complaint they received, how it is “harassment”? If cases were booked of his no fault – then it’s harassment. The way law says no punishment for foul language- so there is no law that only the person has to file case who received the abuse. Anyone who watched the news can file case as per our law

  20. చంద్రబాబు ని జైల్లొ పెట్టిన వెల ఈయన ఎంతగా సమర్దించాడొ మరిచిపొతె ఎలా? కనీసం నామత్రం పరిసోదన కూడా చెయకుండా ఎదొ పెద్ద స్కాం జరిగింది జరిగినట్టు రాసాడు. కనీసం పబ్లిక్ డొమైన్ లొ డాక్యుమెంట్లు కూడా చూడనుకుండా పుంకాలు పుంకాలు రాసాడు! ఇవ్వలా మీడియా అతి అంటూ పత్తిత్తు కబుర్లు చెపితె ఎలా?

    .

    telugu.greatandhra.com/mbs/skill-or-scam-139075.html

  21. చంద్రబాబు ని జైల్లొ పెట్టిన వెల ఈయన ఎంతగా సమర్దించాడొ మరిచిపొతె ఎలా? కనీసం నామత్రం పరిసోదన కూడా చెయకుండా ఎదొ పెద్ద స్కాం జరిగింది జరిగినట్టు రాసాడు. కనీసం పబ్లిక్ డొమైన్ లొ డాక్యుమెంట్లు కూడా చూడకుండా పుంకాలు పుంకాలు రాసాడు! ఇవ్వలా మీడియా అతి అంటూ పత్తిత్తు కబుర్లు చెపితె ఎలా?

    .

    telugu.greatandhra.com/mbs/skill-or-scam-139075.html

  22. చంద్రబాబు ని జైల్లొ పెట్టిన వెల ఈయన ఎంతగా సమర్దించాడొ మరిచిపొతె ఎలా? కనీసం నామత్రం పరిసోదన కూడా చెయకుండా ఎదొ పెద్ద స్కాం జరిగింది జరిగినట్టు రాసాడు. కనీసం పబ్లిక్ డొమైన్ లొ డాక్యుమెంట్లు కూడా చూడకుండా పుంకాలు పుంకాలు రాసాడు! ఇవ్వలా మీడియా అతి అంటూ పత్తిత్తు కబుర్లు చెపితె ఎలా?

    1. బాబోయ్.. ప్రసాద్ గారిని ప్రశ్నిస్తే కోపమొస్తుంది.. కామెంట్స్ డిలీట్ చేసేస్తాడు..

      ..

      ఈ మాత్రం దానికి ఈ సోళ్లేదో ఇంట్లో గోడలకు చెప్పుకోవచ్చు కదా.. తిరిగి ప్రశ్నించవు ..

      ఇంకా తగ్గకపోతే.. సాక్షి ఛానల్ డిబేట్స్ లో పాల్గొనండి.. ఆ జోకర్లతో కలిసిపోవచ్చు..

      ..

      ఈ కా మెంట్ కూడా డిలీట్ చేసేస్తాడు చూడండి..

    2. నామమాత్రపు పరిశోధన కూడా చేయకుండా… అని ఎలా అంటారు? చాలా పరిశోధించి వివరంగా రాశాను. డాక్యుమెంట్లు చూసి రాశాను. స్కామ్ జరగడం వాస్తవమని యిప్పటికీ నమ్ముతున్నాను. ఎటొచ్చీ బాబుని లింకు చేసే ఆధారాలు దొరకడం కష్టం అని రాశాను. ఇప్పటికీ దానికి కట్టుబడి వున్నాను. బాబుని జైల్లో పెట్టడం మహాపరాధం అని నేను అనుకోవటం లేదు. ఎవరినైనా పెట్టవచ్చు. బెయిలు రాకుండా తప్పుడు సెక్షన్లు పెట్టడం సబబు కాదు. బెయిలు తీసుకోకుండా తాత్సారం చేసినది బాబే.

  23. పొనిలెండి ప్రసాద్ గారు, అప్పుడప్పుడు అయ్యినా మీ ముసుగు మీరే పక్కనపెట్టి బయటపడుతూ ఉంటారు. మీ ముసుగు తీసే ప్రయత్నం మేము చేస్తే, మా కామెంట్స్ డిలీట్ చేస్తారు లేకపోతే మోడరేటర్ పేరుతో బ్లాక్ చేస్తారు.

  24. వైస్సార్, జగన్ కి వ్యతిరేకంగా ఎం ఆర్టికల్స్ ఉండవా , లేక మీరు రాయరా.. వాళ్ళిదరు, వాళ్ళ కుటుంబం సత్యహరిస్చంద్రు లు ఆయున్నట్టు వాళ్లకు, వాళ్ళ పార్టీ లకు సానుభూతి ఆర్టికల్స్ రాస్తుంటారు ఎపుడు.

  25. చాంతాడంత ప్రొసీజర్ పెట్టింది…

    మీ లాంటి అనుభవజ్ఞులు, మేధావులు, సకల పరిజ్ఞానం ఉన్నవారు అనదగిన మాట కానే కాదు

    1. మేధావులు, సకల పరిజ్ఞానం ఉన్నవారు.. మాటలు కొట్టేయండి

      అనుభవజ్ఞులు – యిది కరక్టు. బ్యాంకు ఆఫీసరుగా అనుభవం ఉంది. 5 వేలు అప్పు యిచ్చి, తీసుకున్నవాడు కనబడకుండా పోతే బ్యాంకు కేసు పెట్టి, మమ్మల్ని కోర్టుకి పంపేది. అవతలివాడు రాడు, మొహం చూపడు. జజ్ కేసు వాయిదా వేస్తాడు. లాయర్ల ఫీజు కింద 5 వేల కంటె ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్లం.

      రాబోయే రోజుల్లో నేను రాసే వ్యాసాల్లో కొందరు నాయకులు యీ ప్రొసీజర్‌ను వాడుకుని ఎలా సాగదీశారో రాస్తాను. వీలుంటే చదువుదురు గాని

      1. దాన్నే సహజ న్యాయ సూత్రం అంటారు. 5000/- అంత తక్కువైనప్పుడు వసూలు కోసం వెంటపడటం దేనికి.

        1. అదే ప్రొసీజరల్ మేటర్.వాటి గురించే మా బాధ. ఓ పక్క పెద్ద పెద్దవాళ్లకు కోట్లలో రాయితీలు యిస్తారు. కానీ బ్యాంకు రూల్సంటూ ఉన్నపుడు ఫాలో కావలసిందే. అందుకే చాంతాడంత… అని రాసినది

          1. అసలు వీడు బాంకులో పని చేసాడా ?

            పెద్ద పెద్దవాళ్ళకు రాయితీలు ఇస్తారా ? దేనికి ఇస్తారో వీడికి తెలుసా ? పరిశ్రమలు పెట్టటానికి, తద్వారా ఉత్పత్తీ ఉద్యోగాలూ పెంచటానికి ప్రపంచం అంతా పాటించే పద్దతి ఇదే కదా !

            చిన్నపాటి వాళ్ళకు ఇవ్వరా ? వ్యవసాయరుణాలకు weaker sections ku ఇచ్చే రాయితీలు లెక్కలోకి రావా ? సబ్సిడీల వెసులుబాటు ఎవరికి ఇస్తారు

            వీడు హాసం పేపర్ ఎందుకు నడపలేక బబ్బో పెట్టాడో అర్ధమ్ అయ్యింది

            కర్ఫ్యూలో బామ్కు కు వెళ్ళి ఇలాగే పని చేసి ఉంటాడు.

            సమాఅన్యుడు కాదు కదా. అయిదెకరాల పంటను సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళి అమ్మిన ఘనుడు కదా

          2. అసలు వీడు బాంకులో పని చేసాడా ?

            పెద్ద పెద్దవాళ్ళకు రాయితీలు ఇస్తారా ? దేనికి ఇస్తారో వీడికి తెలుసా ? పరిశ్రమలు పెట్టటానికి, తద్వారా ఉత్పత్తీ ఉద్యోగాలూ పెంచటానికి ప్రపంచం అంతా పాటించే పద్దతి ఇదే కదా !

          3. చిన్నపాటి వాళ్ళకు ఇవ్వరా ? వ్యవసాయరుణాలకు ఇచ్చే రాయితీలు లెక్కలోకి రావా ? సబ్సిడీల వెసులుబాటు ఎవరికి ఇస్తారు

          4. వీడు హాసం పేపర్ ఎందుకు నడపలేక బబ్బో పెట్టాడో అర్ధమ్ అయ్యింది

          5. కర్ఫ్యూలో బామ్కు కు వెళ్ళి ఇలాగే పని చేసి ఉంటాడు.

            సమాఅన్యుడు కాదు కదా. అయిదెకరాల పంటను సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళి అమ్మిన ఘనుడు కదా

          6. చిన్నపాటి వాళ్ళకు ఇవ్వరా ? వ్యవసాయరుణాలకు ఇచ్చే రాయితీలు లెక్కలోకి రావా ? సబ్సిడీల వెసులుబాటు బలహీనవర్గాల కు కాక ఎవరికి ఇస్తారు

      2. వీడు బాంకులో ఏ ప్యూన్ గానో పని చేసి ఉంటాడు.

        బాంకులు అయిదువేలకూ పదివేలకూ కోర్టుకు వెళ్ళవు.

        క్రెడిట్ గారంటీ కార్పొరేషన్ నుండి క్లైమ్ చేస్తుంది తప్ప అయిదువేలకూ పదివేలకూ కోర్టులకు వెళ్ళవు.

        అందుకే ఉద్యోగం మధ్యలో పీకేసి ఉంటారు.

  26. మీరు హత్య గురించే రాశారు… మరి ఆత్మహత్య చేసుకొనేతంత మనోవేదన టార్చర్ చేసిన వాటిగురించి. పాపం ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఇలాంటి వ్యాసం ఒక్కటైనా రాశారా?

    1. మీరు అర్ధం చేసుకోవాలి. పాపం అవతల ఉన్నది సాటి ప్రగతిశీల అభ్యుదయ సెక్యులర్ వాద మమత. ఎలా రాయగలడు ?

  27. ఊరుకోండి ! పండగ లో కూడా తెలుగు మాటల పేరడీ అశ్లీలాన్ని ప్రసారం చేస్తూ వేరే వాడు ఎదో అన్నాడు అని రాస్తారు! కాలిన నోట్ల కట్టల సాక్షిగ న్యాయం బలవంతుడికి అమ్మబడును లాంటి దేవతవస్త్రం బోర్డు ఉంది.

  28. writer garu.. CBN lokesh pavan lanu posani direct ga intiki velli leda vallane intiki pilichi okarini okaru tittukunte saripotundi. kaani.. posani garu public ga press meet petti boothulu tidutunte, aa news follow aina valla manobhavalu debbatinava? samajam meeda impact vundadantara? pillalu nerchukora..? YCP govt lo boothulu tittaaru, case lu pettaru.. TDP govt lo boothulu vundavu .. kaani case lu balanga vuntayi kaksha teerchukodaniki.. adi mundugaane alochinchukovali titte munde… india lo chaala cases lo third person vesina cases ekkuva vuntayi.. google cheyyandi.. adi social responsibility kooda… eppudu bayataku raani aadavallani enduku madhya loki laagadam…mee intlo ladies ante meeku kaalada? YCP ni support cheyyochu.. Kaani inta guddi gaana?

  29. మోడీని రాహుల్ అన్నప్పుడూ court లో case అయ్యింది. అప్పుడు మోడీ పెట్టలేదు. ఇప్పుడు పవన్ పెట్టలేదు. అప్పుడు మీరు రాయలేదు. ఇప్పుడు రాస్తున్నారు. ఇక్కడ నేనేదో పవన్ fan కాదు. పోసాని గాని YCP కి కాని వ్యతిరేకి ని కాదు. Infact, I like posani movies & his comedy but not his useless dialogues in public. నా ఇష్టం సినిమా వరకే. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని అడ్డమైనవి వాగ కూడదు. అంతగా దురదుంటే direct గా వెళ్లి తిట్టుకోమనండి. ఎవరొద్దన్నారు. విషయం public గా ఉంటే పోసాని అయినా రాహుల్ అయినా ఒకటే.

  30. పదేళ్ళ తరువాత ఒక ఆడపిల్ల తండ్రి కంట ర.. క్త.. కన్నీరు పెట్టించగల కెపాసిటీ ఉందని చెప్పుకున్న పోసాని శి..క్ష పడగానే 70 ఏళ్ల మూసలివాడిని, రోగిష్టిని అని చెప్పుకోవడం కామెడీగా ఉంది. ఆ మాటలకి సానుభూతి చూపించే వారిని చూస్తే మరింత కామెడీగా ఉంది.

  31. పదేళ్ళ తరువాత ఒక ఆడపిల్ల తండ్రి కంట ర.. క్త.. క.. న్నీ..రు పెట్టించగల కె.. పా..సిటీ ఉందని చెప్పుకున్న పోసాని శి..క్ష పడగానే 70 ఏళ్ల ముసలివా..డిని, రో.. గి.. ష్టిని అని చెప్పుకోవడం కామెడీగా ఉంది. ఆ మాటలకి సానుభూతి చూపించే వారిని చూస్తే మరింత కామెడీగా ఉంది.

  32. పదేళ్ళ తరువాత ఒక ఆడపిల్ల తండ్రి కంట ర.. క్త.. క.. న్నీ..రు పెట్టించగల కె.. పా..సి..టీ ఉందని చెప్పుకున్న పోసాని ఈరోజు 70 ఏళ్ల ముసలివా..డిని, రో.. గి.. ష్టిని అని చెప్పుకోవడం కా..మె..డీగా ఉంది. ఆ మాటలకి సానుభూతి చూపించే వారిని చూస్తే మరింత కామెడీగా ఉంది.

  33. “ఇప్పుడు మీడియాయే ఒకర్ని దోషిగా నిలబెట్టు, వారికి వ్యతిరేకంగా వాదించి తీర్పులు కూడా ఇచ్చేయటంతో ఇది ఒక ప్రహసనంగా మారింది. ఎవరూ నమ్మని స్థితికి దిగింద్”

    ఇది రాసిన ఆపానవాయువుగాడు తన గురించి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి.

  34. edi emina meeru PRO YCP batch ani andariki telusu sir, enduku leni sympathy ni posaniki antagattoddu….ekada kuda ledu sympathy posani pina…verbal diarrhea patient aa posani..

  35. I really admire your take on this MBS garu. At least someone is standing up for this crazy shit being orchestrated in AP by these red-book leaders. I also like your fitting retorts to these TDP/PK’s blind supporters.

Comments are closed.