నాకు జీవించడం రాదు, నటించడం వచ్చు

పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటించడం నాని స్పెషాలిటీ. ఈ క్రమంలో నాని జీవించేస్తున్నాడని ఎవరైనా అంటే మాత్రం ఈ హీరో ఒప్పుకోడు.

నానీని అందరూ నేచురల్ స్టార్ అంటారు. ఎందుకంటే, అతడి యాక్టింగ్ లో అంత సహజత్వం కనిపిస్తుంది కాబట్టి. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటించడం నాని స్పెషాలిటీ. ఈ క్రమంలో నాని జీవించేస్తున్నాడని ఎవరైనా అంటే మాత్రం ఈ హీరో ఒప్పుకోడు.

తనకు జీవించడం రాదని, నటించడం మాత్రమే వచ్చని చెబుతున్నాడు. నిజానికి కొంతమంది తనను మెథడ్ యాక్టర్ అని అంటుంటారని, ఆ పదానికి అర్థం కూడా తనకు తెలియదంటున్నాడు.

ఓ సినిమా చేస్తున్నప్పుడు కొంతమంది ఆ పాత్రలో లీనమైపోయామని చెబుతుంటారు. 24 గంటలు అదే క్యారెక్టర్ లో ఉన్నామని అంటుంటారు. అది కూడా ఎలా సాధ్యమో తనకు తెలియదంటున్నాడు నాని.

ప్రతి రోజూ సెట్స్ పైకి వెళ్లిన తర్వాత సీన్ పై చర్చ మొదలుపెట్టిన తర్వాత మాత్రమే పాత్ర గురించి ఆలోచిస్తానని చెబుతున్నాడు ఈ నటుడు. పాత్ర తీరుతెన్నులు, మేనరిజమ్స్ లాంటివి నిత్యం మనసులోనే ఉంటాయని, కానీ అదే పాత్రతో రోజంతా ప్రయాణం మాత్రం చేయనంటున్నాడు.

ఓ సినిమా చేస్తున్నప్పుడు అందులో రియల్ లైఫ్ నాని కనిపించకూడదనే తాపత్రయం మాత్రం తనకు ఉంటుందని, అదొక్కటి తప్ప ఇంకేం ఆలోచించనని అంటున్నాడు నాని.