అలాంటివి చూసే అమ్మాయిలు లేరనుకోకండి..

ముదితల్‌ నేర్వగ రాని విద్యగలదే.. ముద్దార నేర్పించనన్‌ అంటారు పెద్దలు. ఆడపిల్లలు అన్నీ చేయగలరు. మగాళ్ళతోనూ పోటీపడగలరు. ఇటీవల నిర్భయ లాంటి సంఘటనలు జరగకూడదని హ్యాపీడేస్‌ ఫేం హీరోయిన్‌ సోనియా ఒక సంస్థ వీడియో…

ముదితల్‌ నేర్వగ రాని విద్యగలదే.. ముద్దార నేర్పించనన్‌ అంటారు పెద్దలు. ఆడపిల్లలు అన్నీ చేయగలరు. మగాళ్ళతోనూ పోటీపడగలరు. ఇటీవల నిర్భయ లాంటి సంఘటనలు జరగకూడదని హ్యాపీడేస్‌ ఫేం హీరోయిన్‌ సోనియా ఒక సంస్థ వీడియో చేసింది. ఆ వీడియోలో అమ్మాయికి అన్ని అలవాట్లూ వున్నట్లు చూపిస్తారు. 

సెక్సీ డ్రస్సులు వేసుకోవడం, బార్‌కి వెళ్ళడం పెగ్‌ మీద పెగ్‌ బిగించడం, అబ్బాయిలతో డాన్సులు చెయ్యడంతో సరిపెట్టకుండా ఆమె తన ల్యాప్‌టాప్‌లో బ్లూ ఫిలింస్‌ కూడా చూస్తున్నట్లు చూపించడం పెద్ద చర్చనీయాంశమయ్యింది. సోనియా ఒక సగటు అమ్మాయిగా నటించినప్పటికఅ వన్నీ అమ్మాయిలు చేస్తారు.. తప్పేంటి.? అని ప్రశ్నిస్తారు ఆ వీడియోలో. 

అందులో నటించిన సోనియా మంచి గ్లామర్‌ నటి. హ్యాపీడేస్‌, వినాయకుడు తదితర చిత్రాల్లో నటించి పాపులర్‌ అయ్యింది. ఎందుకో ఆమె హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. చాన్నాళ్ళ గ్యాప్‌ తర్వాత మళ్ళీ ఈ వీడియోతో బయటకు వచ్చింది. 

వ్యక్తిగతంగా తనకు అలాంటి అలవాట్లు లేకపోయినా అమ్మాయిలు శృంగార చిత్రాలు చూసి ఎంజాయ్‌ చేయడంలో తప్పేముంది.? చేస్తే తప్పుగానీ.. చూస్తే తప్పు ఏంటి.. అలాంటివాల్ళు లేరనుకోవద్దని సోనియా చెబుతుంది. మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్స్‌ చెయ్యడానికి కూడా రెడీ.. అంటున్న సోనియాకు అదృష్టం కలిసిరావాలని ఆశిద్దాం.