చాన్నాళ్లకు సిద్ధార్ధ సినిమా

చాన్నాళ్లయింది లవ్ లీ బాయ్ సిద్దార్థ సినిమా తెలుగులోకి వచ్చి. ఇలా వచ్చి అలా బాక్సాఫీసు దగ్గర బోర్లా పడుతుంటే, అతగాడి సినిమాలను పక్కన పెట్టేసారు. ఆ మధ్య ఓ సినిమాను తమిళ నిర్మాతే…

చాన్నాళ్లయింది లవ్ లీ బాయ్ సిద్దార్థ సినిమా తెలుగులోకి వచ్చి. ఇలా వచ్చి అలా బాక్సాఫీసు దగ్గర బోర్లా పడుతుంటే, అతగాడి సినిమాలను పక్కన పెట్టేసారు. ఆ మధ్య ఓ సినిమాను తమిళ నిర్మాతే ధైర్యం చేసి డబ్ చేసి, అడియో ఫంక్షన్ చేసి కూడా వదిలేసాడు. 

ఇప్పుడు తాజగా సిద్ధార్థ నటించిన తమిళ సినిమా ఎన్కుల్ వరువన్ విడుదలయింది. కాస్త మంచి పేరే వచ్చింది. పైగా జోనర్ కూడా బాగుంది. సైకలాజికల్ థ్రిల్లర్. దీన్ని ఇప్పుడు తెలుగులోకి తెస్తున్నారు. నాలో ఒకడు అని టైటిల్ నిర్ణయించారు. ఈ వేసవిలో జనం ముందుకు రావచ్చు.​