పాపం..రాజశేఖర్ టైమ్ కలిసి రావడం లేదు. గెడ్డం గ్యాంగ్..చీదేసింది. నాలుగు కోట్ల లాస్ మిగిల్చింది. పోనీ అది కాస్త ఆడితే, ఆ తరువాత తను, వర్మ కాంబినేషన్ లో తయారైన పట్టపగలు బయటకు తేవచ్చు అనుకున్నారు. అసలు ఈ సినిమా వ్యవహారమే ఎవరికీ ముందూ తెలియదు..ఇప్పుడూ తెలియదు. వున్నట్లుండి టీజర్ వచ్చింది. ఆ తరువాత ఏమయిందో మరి తెలియదు.
రాజశేఖర్ కు మార్కెట్ లేదు. రామ్ గోపాల్ వర్మకు అసలే లేదు. ఈ విషయం మనం చెప్పడం కాదు. ఇటీవల వచ్చిన సినిమాలన్నీ అదే రుజువుచేసాయి.ఈ సినిమాకు నిర్మాత అంటూ ఎవరు లేరని, వర్మే చేసారని వినికిడి. ఇప్పుడు కొనేవాళ్లు లేరు. అందుకని సినిమాను డిక్కీలో వుంచేయడమా..నేరుగా టీవీలో విడుదల చేయడమా అని ఆలోచిస్తున్నాట వర్మ.
ఆ మధ్య ప్రజలే పంపిణీ దారులు, బయ్యర్లు అంటూ టాలీవుడ్ ను మలుపు తిప్పేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థనే సమూలంగా పెకిలించేస్తుంది అంటూ ఓ పథకం ప్రవేశపెట్టాడు. దాని వల్ల బోలెడు మంది కుదేలయ్యారు. మరి దాని ఊసు మరిచిపోయాడు. ఈ సినిమాకు కూడా అది అక్కరకు రాలేదు.