త‌న‌యుడి వేద‌న బాబుకు ప‌ట్ట‌దా?

త‌న‌యుడు నారా లోకేశ్ వేద‌న‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ట్టించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

త‌న‌యుడు నారా లోకేశ్ వేద‌న‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ట్టించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. టీడీపీ ఆవిర్భావ స‌భ‌లో మంత్రి నారా లోకేశ్ కామెంట్స్‌పై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీడీపీలో అంత‌ర్గ‌తంగా లోకేశ్ కామెంట్స్‌పై మాట్లాడుకుంటున్నారు. తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన లోకేశ్ కామెంట్స్ ఏంటంటే…

“నేను పార్టీ ఎదుట ఒక ప్ర‌తిపాద‌న పెట్టాను. ఎవ‌రైనా ఒక ప‌ద‌విలో మూడు కంటే ఎక్కువ సార్లు కొన‌సాగ‌కూడ‌దు. రెండుసార్లు ప‌ద‌వి చేసిన త‌ర్వాత పైస్థాయికైనా వెళ్లాలి. లేదా గ్యాప్ తీసుకోవాలి. ప్ర‌స్తుతం నేను నాలుగోసారి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నా. నా ప్ర‌తిపాద‌న నా నుంచి అమ‌లు కావాలి” అని అన్నారు.

ఔన‌న్నా, కాద‌న్నా టీడీపీలో చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ర్గాలున్నాయి. సీనియ‌ర్లంతా చంద్ర‌బాబు వైపు, జూనియ‌ర్లంతా లోకేశ్ వ‌ర్గంగా కొన‌సాగుతున్నారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ మాట‌కే ఎక్కువ విలువ‌. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన ర‌వినాయుడు అంటే స్థానికుల‌కే తెలియ‌దు. అలాంటి యువ నాయ‌కుడికి మొద‌టి జాబితాలోనే శాప్ చైర్మ‌న్‌గా నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కింది. అలాగే చంద్ర‌బాబు కేబినెట్‌లో ముగ్గురు, న‌లుగురు మిన‌హాయిస్తే, మిగిలిన వాళ్లంతా లోకేశ్ ఖాతాలో ప‌ద‌వులు ద‌క్కించుకున్నారనే అభిప్రాయం లేక‌పోలేదు.

టీడీపీ ఆవిర్భావ స‌భ‌లో లోకేశ్ మాట‌ల్లో నిగూఢ అర్థం దాగి వుంద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. “నాన్నా…ఇప్ప‌టికి మీరు నాలుగో ద‌ఫా ముఖ్య‌మంత్రి. ఇక పైస్థాయికి వెళ్ల‌డం అంటే… ప్ర‌ధాని అయినా కావాలి. లేదంటే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించండి. నాలుగు సారి నేను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నా. ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించి, ముఖ్య‌మంత్రిని చేయ్” అని త‌న తండ్రిని లోకేశ్ కోరారనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

లోకేశ్‌ను సీఎం చేయాల‌ని చంద్ర‌బాబుపై కుటుంబ స‌భ్యులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నార‌నే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ప‌రోక్షంగా త‌న మ‌న‌సులో మాట‌ను లోకేశ్ బ‌హిరంగంగానే వెల్ల‌డించార‌ని అంటున్నారు. లోకేశ్ కీల‌క కామెంట్స్ చేసి, త‌న నుంచే ఆచ‌ర‌ణ మొద‌లు కావాల‌ని కోర‌డాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. ఇది కేవ‌లం త‌న వ‌ర‌కే ప‌రిమిత‌మైన అన్న మాట‌లు ఎంత మాత్రం కాద‌నే వాళ్లే ఎక్కువ‌. రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌ద‌విపై కంటే, దేనిపైన వ్యామోహం వుండ‌దు.

ప‌ద‌వి త‌ర్వాత డ‌బ్బుపై వాళ్ల‌కు ఎక్కువ వ్యామోహం వుంటుంది. లోకేశ్ తాజా కామెంట్స్‌పై ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. లోకేశ్ టీమ్ మాత్రం, త‌మ నాయ‌కుడిని సీఎం చేయ‌డం ఇప్ప‌డు కాక‌పోతే, ఇంకెప్పుడు అని ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం ప‌ద‌విపై చంద్ర‌బాబు వ్యామోహం ఓ తీర‌ని దాహం. ఏమ‌వుతుందో మ‌రి!

9 Replies to “త‌న‌యుడి వేద‌న బాబుకు ప‌ట్ట‌దా?”

  1. ఒరేయ్ సన్నాసి… అందుకేరా చదువుకోవాలి అన్నది. లోకేష్ ప్రతిపాదనలు ఆరు నెలల నుండి చేస్తున్నాడు. లోకేష్ ప్రతిపాదన పార్టీ పదవుల గురించి, ప్రభుత్వ పదవుల విషయం కాదు

  2. Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4

    Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc

    Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y

    Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig

    Mass Maharaja Raviteja movies quiz: https://youtu.be/T5f-eUANVMo

    NagaChaitanya movies quiz: https://youtu.be/9O_bjjU14qM

    Natural star Nani movies quiz: https://youtu.be/GHX1gGNRCvE

    Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE

    JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40

    AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY

    Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg

  3. Lokesh ayithe manchidegaa .. oka prabudhudu 2000 savatsaram lo kotinnara appu chesi illu katti 2004 lo mukhyamantri ayyaka koduku cheta addam gaa avineethi cheyinchi 2008 kallaa ooriko palace kattinchaadu . Aa tarvatha aa koduku chetullone khatam ayyadu .. alaanti koduku kante lokesh 1000 retlu better

Comments are closed.