టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీని వణికిస్తోంది పైరసీ భూతం. సినిమా రిలీజైన గంటల వ్యవథిలోనే హెచ్ డీ ప్రింట్ ను సోషల్ మీడియాలో లీక్ చేస్తూ, ఇండస్ట్రీని దెబ్బ తీస్తోంది. అయితే విడుదలకు ముందే పైరసీకి గురైన సినిమా వ్యథ ఇది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది రిలీజవ్వడానికి కొన్ని గంటల ముందు, ఈ సినిమా ప్రింట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో యూనిట్ షాకైంది.
సల్మాన్ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని ఓ సంస్థ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. విడుదలకు సరిగ్గా 3 రోజుల ముందు కూడా ఈ హెచ్చరికలొచ్చాయి.
అయితే చాలామంది వీటిని నమ్మలేదు. కానీ ఆ సంస్థ మాత్రం చెప్పినట్టే చేసింది. రిలీజ్ కు సరిగ్గా 5 గంటల ముందు సికిందర్ హెచ్ డీ ప్రింట్ ను ఆన్ లైన్ లో లీక్ చేసింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ కు చెందిన టెక్నీషియన్లే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
కొద్దిసేపటికి క్రితం థియేటర్లలోకి వచ్చింది సికిందర్ సినిమా. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5500 స్క్రీన్స్ పై 22000 షోలు వేస్తున్నారు. ఓ హిందీ సినిమాకు ఇన్ని షోలు పడడం ఇదే తొలిసారి.
అయినా చూడం.
Boycott bhai movies in tollywood