అవును.. వాళ్లిద్దరూ విడిపోవడం లేదు

ఎప్పట్లానే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు.

కొన్ని రోజుల కిందటి సంగతి. వరుసగా 2 ఫ్లాపులు రావడంతో పూరి-ఛార్మి కాంబినేషన్ విడిపోయినట్టు ప్రచారం జరిగింది. పైగా లైగర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలొచ్చినట్టు వార్తలొచ్చాయి. తన నెక్ట్స్ సినిమాకు పూరి జగన్నాధ్, వేరే నిర్మాతతో కలిసి పనిచేసే అవకాశం ఉందంటూ కథనాలొచ్చాయి. కట్ చేస్తే, ఇవన్నీ వాస్తవాలు కాదని తేలింది.

పూరి జగన్నాధ్, చార్మి కౌర్ పార్టనర్ షిప్ కొనసాగుతోంది. తదుపరి చిత్రాన్ని కూడా ఇద్దరూ కలిసే చేయబోతున్నారు. విజయ్ సేతుపతి హీరోగా సినిమా ఎనౌన్స్ చేశాడు పూరి జగన్నాధ్. దీనికి సంబంధించి ఫొటో కూడా విడుదల చేశారు.

పూరి-సేతుపతి కలిసి సినిమా చేస్తున్నారనే మేటర్ కంటే, పూరి-చార్మి కలిసి ఈ ఫొటో దిగడం చాలామందిని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టు కోసం పూరి జగన్నాధ్ తన శైలి నుంచి కాస్త పక్కకొచ్చి, డిఫరెంట్ స్క్రిప్ట్, క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడట. ఈరోజు సినిమాను ప్రకటిస్తూ, ఈ విషయాన్నే ఎక్కువగా హైలెట్ చేశారు.

జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పట్లానే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి చెప్పలేదు.

5 Replies to “అవును.. వాళ్లిద్దరూ విడిపోవడం లేదు”

  1. Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4

    Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc

    Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y

    Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig

    Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE

    JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40

    AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY

    Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg

Comments are closed.