వైసీపీ మాజీ మంత్రికి మొదలైంది!

సీదరి మీద మరిన్ని కేసులు పెడతారా ఇది ఎంతవరకూ వెళ్ళవచ్చు అన్నది వైసీపీలో కార్యకర్తలు తర్కించుకుంటున్నారు.

కేసుల పరంపర అన్నది గత తొమ్మిది నెలల కాలంలో వైసీపీ నేతల మీద సాగుతున్న సంగతి విధితమే. ఈ కేసులతో కొందరు అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. మరికొందరు కేసులు తమదాకా వస్తాయేమోనని ముందస్తు బెయిల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉత్తరాంధ్రాలో మాజీ మంత్రి ఒకరికి ఈ కేసుల బెడద మొదలైంది అని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మీద కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయింది. ఆయన పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ ఈ కేసు నమోదు అయింది.

దీని మీద మాజీ మంత్రి సీదిరి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నించే వారిని చూసి కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ విధంగా చేయడం సరికాదని ఆయన అన్నారు ఢిల్లీ రావు మృతి కేసులో నిజాలు తేల్చాలని తాను డిమాండ్ చేశాను అని ఆయన చెప్పారు ఈ మేరకు తాను డీఎస్పీకి వినతిపత్రం అందించానని చెప్పారు. అయితే ఎప్పటికీ ఆ కేసును తేల్చక పోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశామని తెలిపారు

విషయం ఇది అయితే తాను తప్పు చేసినట్లుగా కేసులు పెట్టడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సీదరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో పలాసలో టీడీపీతో టగ్ ఆఫ్ వార్ గా నడిచింది. ఆ సమయంలో అధికారంలో ఉండటంతో పైచేయి వైసీపీ సాధించినా ఇప్పుడు గౌతు శిరీష ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ సీదరి ని టార్గెట్ చేసింది అని వైసీపీ నేతలు అంటున్నారు. సీదరి మీద మరిన్ని కేసులు పెడతారా ఇది ఎంతవరకూ వెళ్ళవచ్చు అన్నది వైసీపీలో కార్యకర్తలు తర్కించుకుంటున్నారు.

8 Replies to “వైసీపీ మాజీ మంత్రికి మొదలైంది!”

  1. Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4

    Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc

    Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y

    Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig

    Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE

    JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40

    AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY

    Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg

  2. Orni GA, assembly lo unna almost andari meeda, social media, TDP n JSP cadre andari meeda YCP paalana lo caselu pettaru kadara..vaallu edo Gandhi lu ainattu chebutunnav.. entho mandini mid night godalu dooki mari jail lo pettaru..avanni neeku gurtu leda..veellu inka nayam court laki velli bail techukonevaraku aagutunnaru..ichinappudu teesukovadam kuda raavaliga

Comments are closed.