నితిన్ సినిమాకు `ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్`.. అనే టైటిల్ పెట్టినట్టు గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు అదే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమా ఆగినట్టు ఈమధ్య ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెడుతూ సినిమా అప్ డేట్స్ ఇచ్చారు. అదే క్రమంలో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు.
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ కు తగ్గట్టే నితిన్ ఓ క్యారెక్టర్ లో కాస్త 'ఎక్స్ ట్రా'గా.. మరో పాత్రలో 'ఆర్డినరీ'గా కనిపిస్తున్నాడు. సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 60శాతం షూటింగ్ కూడా పూర్తయిందంటున్నారు.
టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఒకేసారి చెప్పేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ టైమ్ కు ఆల్రెడీ హాయ్ నాన్న (డిసెంబర్ 21), సైంధవ్ (డిసెంబర్ 22) సినిమాలు షెడ్యూల్ అయి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ సినిమా కూడా రేసులో చేరిందన్నమాట.
ఈ ప్రాజెక్టుపై నితిన్-వక్కంతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కిక్ సినిమా రేంజ్ లో నవ్విస్తూ, సర్ ప్రైజ్ లు ఇస్తుందని అంటున్నారు. హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.