ఇదో ఇంట్రెస్టింగ్ మేటర్. బ్రో సినిమా సెట్స్ కు సాయిధరమ్ తేజ్ తాగి సెట్స్ కు వెళ్లాడా? ఈ అనుమానం యూనిట్ సభ్యులకు రాలేదు. స్వయంగా అందులో హీరోగా నటించిన పవన్ కల్యాణ్ కు వచ్చింది. అయితే అది అనుమానం కాదు, సరదాగానే పవన్ తనను అలా అడిగాడని అంటున్నాడు సాయితేజ్.
బ్రో సినిమాకు సంబంధించి కేక్ తినిపించే సీన్ దగ్గర బాగా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నేను ఇబ్బంది పడిన సన్నివేశం. ఓ డ్రింక్ సీన్. పవన్ ముందు తాగుతూ నటించే సన్నివేశం అది. ఓ సీన్ లో పవన్ కల్యాణ్ ముందు తాగుతూ నటించాలి. కాస్త ఇబ్బందిపడినా ఆ సీన్ పర్ ఫెక్ట్ గా వచ్చింది. సీన్ అయిన తర్వాత పవన్ కల్యాణ్ నా దగ్గరకొచ్చి తాగి సెట్స్ కి వచ్చావా అని అడిగారు. లేదని చెప్పాను. చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. తాగుడు మీద మంచి పట్టు ఉన్నట్టుందంటూ ఆటపట్టించారు. ఆ సీన్ నాకు బాగా నచ్చింది.”
పవన్ తనను అలా ఆటపట్టిస్తుంటే, తనకు తెలియకుండానే దర్శకుడు సముద్రఖని ఆ సీన్ ను షూట్ చేశాడని తెలిపాడు సాయితేజ్. సినిమాలో అలాంటి సందర్భాలు 2-3 ఉన్నాయని తెలిపాడు.
సినిమాలో తనది, పవన్ కల్యాణ్ ది బాండింగ్ చాలా బాగుంటుందని అంటున్నాడు సాయితేజ్. దేవుడి పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ బీడి పట్టుకోవడం ఏంటి.. లుంగీ కట్టడం ఏంటి లాంటి లాజిక్స్ తీయకుండా.. ఇద్దరి కాంబినేషన్ ను, బాండింగ్ ను స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది బ్రో.