ఎవరైనా సూపర్ హిట్ కాంబినేషన్ కోరుకుంటారు. లిస్ట్ లో హిట్ డైరక్టర్ ఉంటే ఆ క్రేజ్ వేరు. ప్రాజెక్టు వెయిట్ పెరుగుతుంది. పైగా సక్సెస్ అనేది ఓ సెంటిమెంట్ ఇండస్ట్రీలో. అలాంటిది ఈ మెగా హీరో మాత్రం ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అతడే వరుణ్ తేజ్.
ప్రస్తుతం ఈ హీరో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇంతకుముందు ఈ డైరక్టర్, ది ఘోస్ట్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ, వరుణ్ తేజ్ అతడికి అవకాశం ఇచ్చాడు.
ఇక ఈ లిస్ట్ లో ఇంకో డైరక్టర్ కూడా ఉన్నాడు. అతడే కరుణ కుమార్. త్వరలోనే కరుణకుమార్ తో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు వరుణ్ తేజ్. ఈ వారమే ఓపెనింగ్ పెట్టుకున్నారు.
ఇంతకుముందు శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు కరుణకుమార్. ఆ తర్వాత అతడు తీసిన కళాపురం అనే సినిమా అయితే అరివీర భయంకరమైన డిజాస్టర్. ఇలాంటి దర్శకుడికి వరుణ్ తేజ్ అవకాశం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే దీనిపై గద్దలకొండ గణేశ్ టైమ్ లోనే క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్. తను కేవలం కంటెంట్ చూస్తానని, కథ నచ్చితే, ఏ దర్శకుడికైనా అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. కానీ జనాలు మాత్రం రిస్క్ అంటున్నారు.