ఎవరికి వారే సత్యమూర్తి తీరే

తన సినిమాకు ఫబ్లిసిటీ బాగుండాలని, సినిమాతో సంబంధం వున్న ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే అది ఒక టీమ్ వర్క్ గా జరుగుతుంది సాధారణంగా. నిర్మాత, దర్ళకుడు, హీరో కలిసి ప్లాన్ చేయడం జరుగుతుంది.…

తన సినిమాకు ఫబ్లిసిటీ బాగుండాలని, సినిమాతో సంబంధం వున్న ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే అది ఒక టీమ్ వర్క్ గా జరుగుతుంది సాధారణంగా. నిర్మాత, దర్ళకుడు, హీరో కలిసి ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ సన్నాఫ్ సత్యమూర్తి విషయంలో కాస్త తేడాగా కనిపిస్తోంది. సినిమా తరపున ఓ పద్దతిగా పబ్లిసిటీ ప్లాన్ చేయకుండా ఎవరికి తోచినట్లు వారు చేస్తున్నారు. ఇలాంటి సినిమా స్టిల్స్ ఎప్పుడు బయటడకు వస్తాయా? చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. 

ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కొందరు. సినిమా స్టిల్స్ విడదల చేస్తే బన్నీ సైట్లు, సోషల్ నెట్ వర్క్ చూసేవాళ్లు వాళ్లకే పరిమితం చేసుకుని మిగిలినవారికి ఇవ్వడం లేదట. మరోపక్క నిర్మాత స్వంత సైట్ వుంది. దాంట్లో పెట్టేసుకుని, మిగిలిన వారికి ఇవ్వడం లేదు దాని నిర్వాహకులు. ఇంకోపక్క శ్రియా మీడియాది అదేదారి. 

ఇలాంటి నేపథ్యంలో ఆదాశర్మ స్టిల్ ఇంతవరకు బయటకు రాలేదు. దాంతో ఆమె ఇదేంటీ అని దర్శకుడు త్రివిక్రమ్ ను అడిగినట్లు వినికిడి. ఆమె రేపు జరిగే అడియో ఫంక్షన్ లో ఫెర్ ఫార్మెన్స్ కూడా చేయాల్సివుంది. దాంతో అర్జెంట్ గా దర్శకుడు తివిక్రమ్ కలుగ చేసుకుని, శనివారం రాత్రి అప్పటికప్పుడు ఆమె స్టిల్ ను విడుదల చేసారు. 

నిజానికి ఈ సినిమా ఫబ్లిసిటీ ఓ రేంజ్ లో వుండాలని. త్రివిక్రమ్ తన ప్లానింగ్ తాను చేస్తున్నారు.. ఇంతవరకు అందరు స్టార్ లను అలా అలా పరిచయం చేసారు. ఆపై అల్లు అర్జున్ టీజర్ విడుదల చేసారు కానీ నిత్య, సమంత, తదితరుల స్టిల్స్ తరువాత బయటకు వచ్చాయి. . తొలిసారి ఆదా శర్మ స్టిల్ బయటకు వచ్చింది. త్రివిక్రమ్ స్టయిల్ లోనే చాలా అందంగా మెరిసింది ఆదా.

తివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నట్లు వినికిడి.. ఈ  సినిమా హిట్ అయితే త్రివిక్రమ్ రేంజ్ ఫుల్ టాప్ కు చేరిపోతుంది. ఇప్పటికే ఆయన ఏస్ డైరక్టర్. ఇకపై ఏస్ లకే ఏస్ అయిపోతారు. అందుకే త్రివిక్రమ్ సినిమా మీదే కాక,  ప్రచారం పైన కూడా కన్నేసినట్లు వినికిడి. సినిమా విడుదలకు, ముందు, తరువాత, తన స్టయిల్ లో, తన పబ్లిసిటీ తాను చేసేందుకు స్వంత ఏర్పాట్లు చేసుకున్నట్లు వినికిడి.