చైతన్య దోచేస్తాడా?

సినిమాకు పేర్లు కరువైపోతున్నాయి..కాస్త నెగిటివ్ టచ్ లేదా మాస్ టచ్ వుండాలని చూస్తున్నారు. అందుకోసమే  రఫ్, టెంపర్, జులాయి..ఇలా ట్రయ్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ్ చైతన్య కూడా ఆ బాటలో పడ్డట్లు కనిపిస్తోంది.  Advertisement…

సినిమాకు పేర్లు కరువైపోతున్నాయి..కాస్త నెగిటివ్ టచ్ లేదా మాస్ టచ్ వుండాలని చూస్తున్నారు. అందుకోసమే  రఫ్, టెంపర్, జులాయి..ఇలా ట్రయ్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ్ చైతన్య కూడా ఆ బాటలో పడ్డట్లు కనిపిస్తోంది. 

స్వామిరారాతో హిట్ కొట్టి రెండోసినిమాకే నాగ్ చైతన్యతో సినిమా చేస్తున్న సుధీర్ వర్మ సినిమాకు ఇప్పుడు కొత్త టైటిల్ డిసైడ్ చేసినట్లు తెలిసింది. ఆ మధ్య ఈ సినిమాకు చాలా టైటిళ్లు వినిపించాయి కానీ, ఇప్పుడు కొత్త టైటిల్ గా ‘దోచేయ్’ అని డిసైడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు టైటిల్ రిజిస్టర్ జరిగిట్లు బోగట్టా.  

ఇక చైతూ ప్రేక్షకుల, అభిమానులు మనసులు ఈ టైటిల్ తో దోచేస్తాడన్నమాట.