మళ్లీ స్క్రీన్ మీదకు రేణు దేశాయ్

రేణు దేశాయ్..జనం మర్చిపోదామన్నా ఆమె మరిచిపోనివ్వని పేరు. ఇటీవల కాలంలో ట్విట్టర్ లు, యూ ట్యూబ్ ల్లో కాస్త మారుమోగింది. ఆ సంగతి ఎలా వున్నా, యూ ట్యూబ్ లో ఆమె ఇంటర్వూ చూసిన…

రేణు దేశాయ్..జనం మర్చిపోదామన్నా ఆమె మరిచిపోనివ్వని పేరు. ఇటీవల కాలంలో ట్విట్టర్ లు, యూ ట్యూబ్ ల్లో కాస్త మారుమోగింది. ఆ సంగతి ఎలా వున్నా, యూ ట్యూబ్ లో ఆమె ఇంటర్వూ చూసిన దర్శకులు, నిర్మాతలు ఆమెను మళ్లీ స్క్రీన్ మీదకు తీసుకువస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. 

ముఫ్ఫై అయిదేళ్ల మహిళగా మంచి లుక్స్ తో వున్న రేణు అత్తారింటికి దారేదిలో నదియా చేసిన మంచి క్యారెక్టర్లకు బాగా సూటవుతుందని అనుకుంటున్నారట. ఇప్పటికే ఒకరిద్దరు సూచనప్రాయంగా కబురు చేసినట్లు, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, మరీ అద్భుతమైన పాత్ర వుంటే చూడొచ్చని బదులు వచ్చినట్లు టాక్. 

రేణు ఓకే అంటే మాత్రం కొన్నాళ్లు టాలీవుడ్ స్క్రీన్ పై వదిన, అక్క, లేడీ బాస్ క్యారెక్టర్లలో  బాగానే కనిపిస్తుంది.​