అమ్మో…అవిక.!

అవిక గౌర్..ముద్దు ముద్దుమాటలతో, మన పక్కింటి అమ్మాయిలా కనిపించి తెగ పాపులర్ అయిపోయింది చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో,. దానికి తోడు ఉయ్యాల జంపాల సినిమా మరింత చేరువచేసింది. కానీ స్క్రీన్ మీద కనిపించేంత…

అవిక గౌర్..ముద్దు ముద్దుమాటలతో, మన పక్కింటి అమ్మాయిలా కనిపించి తెగ పాపులర్ అయిపోయింది చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో,. దానికి తోడు ఉయ్యాల జంపాల సినిమా మరింత చేరువచేసింది. కానీ స్క్రీన్ మీద కనిపించేంత నెమ్మది కాదట అమ్మడు. సినిమాల విషయంలో చాలా కచ్చితంగా వుంటుందట. నిర్మాతలకు కాస్త కండిషన్లు కూడా ఎక్కువేనట. 

కాస్ట్యూమ్స్ తనకు వదిలేయాలి. సీన్ ఏదైనా డెసిషన్ తనదే ఆవిషయంలో. ఆ మధ్య విడుదలైన సినిమాలో హీరో అయితే అవిక తో కాస్త మాట్లాడడానికే జంకిపోయేవాడట. అంత సీరియస్ వ్యవహారమట. దీనివల్లేనా అమ్మడు అంత పాపులర్ అయినా చాన్స్ లు కాస్త తక్కువగా వున్నాయి..లేదా ఛూజీ గా చేస్తోంది అనుకోవాలా?