నందిత ట్రబులిస్తోందా?

నందిత..ప్రేమ కథా చిత్రమ్ సినమాతో తొలి హిట్ కొట్టిన హీరోయిన్. ఆ హిట్ తో మలి చిత్రంగా మలయాళంలో ఏకంగా పృధ్వీరాజ్ సరసనే చాన్స్ కొట్టేసింది. ఆ తరువాత మళ్లీ తెలుగులో హిట్టూ లేదు,…

నందిత..ప్రేమ కథా చిత్రమ్ సినమాతో తొలి హిట్ కొట్టిన హీరోయిన్. ఆ హిట్ తో మలి చిత్రంగా మలయాళంలో ఏకంగా పృధ్వీరాజ్ సరసనే చాన్స్ కొట్టేసింది. ఆ తరువాత మళ్లీ తెలుగులో హిట్టూ లేదు, పెద్దగా సినిమాలూ లేవు. అయినా మళ్లీ మారుతి తన సినిమా లవర్స్ లొ అవకాశం ఇచ్చాడు బాగానే వుంది.

అయితే ఇప్పుడు అదే నందిత ఆ సినిమా యూనిట్ కు ట్రబులిస్తోందని ఆ వర్గాల బోగట్టా. సినిమా ప్రమోషన్ కు రమ్మంటే, ఇబ్బంది పడుతోంది.. అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. 'మా అమ్మాయిని మరీ ఇబ్బంది పెడితే ఎలా..కావాలంటే రోజుకు ఓ చానెల్ కో, ఓ పత్రికకో ఇంటర్వ్యూ ప్లాన్ చేసకోండి, అంతకు మించి వద్దు' అంటోదంట ఆమె మదర్. 

ఇలా అయితే ఎన్నాళ్లకు సినిమా ప్రమోషన్ పూర్తవుతుందని యూనిట్ జనం బుర్రలు పట్టుకుంటున్నారట. పోనీ నందిత ఫుల్ బిజీయేమో అనుకుంటే, అక్కడ అంత సీన్ కూడా లేదని వినికిడి.