సరైన సినిమా పడితే చాలు బ్రేక్ వచ్చేస్తుంది. ఇప్పడు సప్తగిరి టైమ్ బాగుంది. వరుస సినిమాలు పడుతున్నాయి. ఆ సినిమాల సంగతి ఎలా వున్నా, సప్తగిరికి నేమ్ బాగానే వస్తోంది. మనం, గీతాంజలి, గాలిపటం, ఇప్పుడు లవర్స్…బి. సి. సెంటర్ల జనాలకు మాస్ కామడీ అందించడంలో ఓకె అనిపించుకున్నాడు..
Advertisement
దాంతో అతగాడు తన రేటు బాగానే పెంచినట్లు వినికిడి. సప్తగిరి కూడా సినిమాల లెక్క నుంచి రోజుల లెక్కకు వచ్చాడని, రోజుకు లక్ష నుంచి ఆ పైన డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. బాగుంది మరి, దీపం వున్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎవరైనా?