అక్కడ పందిమాంసం తిని ప్రాణాల‌తో తిరిగి రాగ‌ల‌రా?

మ‌న దేశ రాజ‌కీయాలు ఒక్కోసారి ఒక్కో అంశం చుట్టూ ప‌రిభ్రమిస్తుంటాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈసారి ఆ అంశం మాంసం అయింది. మాంసం విక్రయాల‌పై నిషేధం ద‌గ్గర్నుంచి గొడ్డు మాంసం పై వివాదాలు, హ‌త్యలు దాకా వెళ్లిపోయింది.…

మ‌న దేశ రాజ‌కీయాలు ఒక్కోసారి ఒక్కో అంశం చుట్టూ ప‌రిభ్రమిస్తుంటాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈసారి ఆ అంశం మాంసం అయింది. మాంసం విక్రయాల‌పై నిషేధం ద‌గ్గర్నుంచి గొడ్డు మాంసం పై వివాదాలు, హ‌త్యలు దాకా వెళ్లిపోయింది.

ఈ నేప‌ధ్యంలో… తాజాగా ఒక విశ్వహిందూ ప‌రిష‌త్‌ నేత ఒక‌రు త‌న వంతుగా అగ్నిలో ఆజ్యం చ‌ల్లాడు. దాద్రి ఘ‌ట‌న త‌ర్వాత ఒక విహెచ్‌పి నేత చేసిన తొలి వ్యాఖ్యానం ఇదే కావ‌డంతో దీనిపై ఏం దుమారం చెల‌రేగుతోంద‌న‌ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

విహెచ్‌పి జాతీయ అధికార ప్రతినిధి సురేంద్ర జైన్‌ ఉత్తర‌ప్రదేశ్‌లోల‌క్నోలో జ‌రుగుతున్న విహెచ్‌పి స‌మ‌వేశాల్లో  ప్రసంగిస్తూ… పందిమాంసం  (పోర్క్‌) గురించి ప్రస్తావించాడు. ఎవ‌రైనా స‌రే ప్రపంచంలో ఎక్కడైనా స‌రే పోర్క్ తినొచ్చేమో గాని ఒక ముస్లిం దేశంలో అది సాధ్యమా? అంటూ ఆయ‌న ప్రశ్నించాడు.

సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశానికి వెళ్లి, అక్కడ పోర్క్ తినే ధైర్యస్థులు ఎవ‌రైనా ఉన్నారా? అని ఆయ‌న స‌వాల్ విసిరారు. అలాంటి ద‌మ్మున్నవాళ్లు అక్కడికి వెళ్లి తిని ప్రాణాల‌తో తిరిగి రాగ‌ల‌రా? అని ప్రశ్నించారు. అలా తిరిగి రాగ‌లిగిన‌వాళ్లెవ‌రైనా ఉంటే తానే స్వయంగా వారిని ఎదురేగి స్వాగ‌తించి, స‌న్మానిస్తాన‌న్నాడాయ‌న‌. అలా చేయ‌లేని ప‌క్షంలో హిపోక్రసీ చూప‌డం మానేయాల‌న్నాడు. 

మ‌న దేశంలో మూడింట రెండువంతుల మంది శాఖాహారులేన‌నే విష‌యం విహెచ్‌పి, సంఘ‌ప‌రివార్‌కు బాగా తెలుస‌న్నాడు. అయితే ఇత‌రుల ఆహార‌పు అల‌వాట్లు మార్చాల్సిన అగ‌త్యం త‌మ‌కు లేద‌న్నాడు. అలాగే ఇత‌ర మ‌త‌స్థుల మ‌నోభావాల్ని గౌర‌విస్తామ‌న్నాడు, బీఫ్ తిన‌డాన్ని,  హిందువుల‌కు అమ్మ లాంటి గోవుల‌ను వ‌ధించ‌డాన్ని  తాము పూర్తిగా బ్యాన్ చేయాల‌ని కోరుతున్నామ‌న్నాడు.