ఆది బ్యాక్ టు లవ్

మ..మ..మాస్ సినిమాలు చేయాలని కిందా మీదా పడని యువ హీరో ఆదికి జ్ఞానోదయం అయిందా? మళ్లీ లవ్ అండ్ ఫన్ జోనర్ లోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. తనకు తొలి రెండుహిట్ లు ఇచ్చిన  జోనర్…

మ..మ..మాస్ సినిమాలు చేయాలని కిందా మీదా పడని యువ హీరో ఆదికి జ్ఞానోదయం అయిందా? మళ్లీ లవ్ అండ్ ఫన్ జోనర్ లోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. తనకు తొలి రెండుహిట్ లు ఇచ్చిన  జోనర్ అదే. 

ఆ మధ్య గాలిపటం కూడా కాస్త యూత్ ఫిల్మే. అందుకే మళ్లీ బుద్ధిగా యూత్,లవ్, ఫన్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నాడట. తనకు గతంలో ఓ హిట్ ఇచ్చిన డైరక్టర్ తో తాను సినిమా చేసేందుకు రెడీ అని కబురుపెట్టాడట. అయితే ఆ డైరక్టర్ హీరోయిన్ గా రకుల్ ను తెచ్చుకుంటే తాను రెడీ అని చెప్పినట్లు వినికిడి. 

ఇక్కడ ఈ లింక్ ఏమిటంటే, రకుల్ తో ఆదికి కాస్త మంచి స్నేహమే వుందట. అంతవరకు ఓకె. కానీ తొలి సినిమా అంటే రకుల్ ఓకె అంది కానీ, ఇప్పుడు రవితేజ, పవన్ రేంజ్ లకు వెళ్లిపోయాక ఆదికి ఓకె అంటుందా..ఎంత ఫ్రెండ్ షిప్ వున్నా కూడా.