ఓ అప్ కమింగ్ అనాలో, కొత్త అనాలో తెలియని హీరో వున్నారు. డబ్బులు బాగా వున్నాయి. అందుకే ఇటీవల హిట్ కొట్టిన కార్తికేయ డైరక్టర్ చందును పిలిచి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఇరవై కోట్లు ఇస్తా..తీసుకో..తిన్నంత తిను…మిగిలిన దాంతో మంచి సినిమా తీసిపెట్టు చాలు…అన్నాడట. అదీ ఆఫర్. కానీ చందు…సారీ అన్నాడని వినికిడి.
అదేంటీ…అంత మంచి ఆపర్ అంటే, సినిమా తీసి హిట్ కొట్టలేకపోతే, వచ్చిన సక్సెస్ పోతుంది కదా అన్నది ఆన్సరట. సినిమా ఎందుకు పోతుందీ అంటే సమాధానం చెప్పడట. అంటే హీరోతోనే ఏదో తేడా వుండి వుండాలి.
అవును ఇంతకీ ఇటీవల ఆ హీరో సినిమా భారీగా వచ్చింది. అక్కడా ఇలాగే తిన్నంత..తీసినంత ఆఫర్ ఇచ్చాడంటారా? గమ్మత్తుగా ఆ సినిమాకు 20 కోట్లే ఖర్చయిందని దర్శకుడు టీవీల్లో చెప్పారు కూడా. ఏమో ఎవరికి ఎరుక?