రవిబాబు…ఓ విభిన్న దర్శకుడు. మన సినిమా జనాలు చాలా మంది విదేశాల్లో చదువుకుంటారు..లేదా విదేశీ సినిమాలు తెగచూస్తారు కానీ కొత్త ప్రయోగాలకు, లేదా విభిన్నమైన సినిమాలు రూపొందించడానికి మాత్రం అంత సులువుగా ముందుకు రారు. సినిమా అంటే విషయం నిండుగా వుండాలి కానీ ఖర్చు మెండుగా కాదు అన్న వైనం అస్సలు తెలుసుకోరు. కానీ రవిబాబు లైన్ వేరే..తీసిన సినిమా మళ్లీ తీయడం అంటే కాస్త చికాకు. సినిమా సినిమాకు కాస్త వైవిధ్యం కనిపించాలి. కానీ రవిబాబు అంటే మన జనాలకు థ్రిల్లర్లే గుర్తుకు వస్తాయి. అలాంటి రవిబాబు ఇప్పుడు తన అవును సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు..కాదు..కాదు..పార్ట్ 2 తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ‘గ్రేట్ ఆంధ్ర’ ఇంటర్వూ’.
Video: Ravi Babu Special Interview About Avunu 2
- అందరూ సీక్వెళ్ల బాటలో వున్నారని మీరూ దిగారా..లేక అవును తీసినపుడే ఇది కూడా అనుకున్నారా?
అవును సినిమా చేసేటపుడే పార్ట్ 2 చేయాలనే ఆటిట్యూడ్ తోనే అక్కడ ఆపాం. కానీ ఇమ్మీడియట్ గా చేస్తే ఎలా వుంటుందో అని, కాస్త గ్యాప్ తీసుకుని పార్ట్ 2 చేసాం. అసలు దీన్ని సీక్వెల్ అనరు. పార్ట్ 2 అనే అంటాం. ఆ సినిమాను ఎక్కడ ఆపామో అక్కడే ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఒక బుక్ ను రెండు చాప్టర్లు అనుకుంటే, ఇది రెండో చాప్టర్ అన్నమాట.
- అంటే ఇందులోనూ కెప్టెన్ రాజు వుంటాడా?
ఎస్. ఇది కెప్టెన్ రాజు కథే. కెప్టెన్ రాజు, మోహిని, హర్ష ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లు వుంటాయి. ఈ చాప్టర్ లోకి అవసరం లేదనుకున్న కొన్ని తప్ప. అప్పుడు ఎవరి చుట్టూ అయితే కథ రన్ అయిందో, ఇక్కడా అదే విధంగా వుంటుంది. కెప్టెన్ రాజు విలనే. హర్ష హీరోనే.
- మీరు ఓ జోనర్ కు ఫిక్స్ అయిపోతున్నారని అనిపించడం లేదా?
నేనా?ఫిల్మ్ మేకర్ గా నేను తీసినన్ని జోనర్ లు ఎవరూ తీసి వుండరు.
- థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్ కు అన్నది మీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది కదా?
నేను అనుకునేది ఏమిటంటే, ఎవరు సినిమాకు వెళ్లినా, నేను సినిమాకు వెళ్లినా, ఆ జోనర్ కు సంబంధించిన పీక్ ఎమోషన్ నే ఎక్సీపీరియన్స్ చేయాలనుకుంటారు. ఒక కామెడీ సినిమాకు వెళ్తే విపరీతంగా నవ్వాలనుకుంటాను. యాక్షన్ సినిమాకు వెళ్తే విపరీతమైన యాక్షన్ చూడాలనుకుంటాను. అలాగే హర్రర్..విపరీతమైన సీట్ ఆప్ ఎగ్జయిట్ మెంట్, విపరీతమైన భయం ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటారు. సో, ఇందులో హాఫ్ హార్టెడ్ అప్రోచ్ అన్నది తప్పు. కాంప్రమైజ్ అయ్యి, ఆ జోనర్ ను డైల్యూట్ చేయడం సరికాదు. ఆ జోనర్ కు సంబంధించినంత వరకు అందుకే ఫిక్స్ అయి తీయడం మంచిదని అనుకుంటాను.
- ఇప్పుడు చాలా మంది దర్శకులు రెండు మూడు సినిమాలు చేయగానే పెద్ద సినిమా చేయాలి లేదా పెద్ద హీరోతో చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నట్లు లేదు.?
నాకు సినిమాల్లో పెద్దవి, చిన్నవి అన్న డిస్టింక్షన్ తెలియదు. మంచివి, చెడ్డవి, ఇంట్రెస్టింగ్, నాన్ ఇంట్రస్టింగ్, తెలుసు. సో నాకు ఏ కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఆ సినిమా చేస్తాను.అంతేకానీ చిన్నదా పెద్దదా, చిన్నబడ్జెట్ నా, పెద్ద బడ్జెట్ నా అన్నది చూడను.
Video: Ravi Babu Special Interview About Avunu 2
- పెద్ద హీరోలు?
పెద్ద హీరోలు అంటే నాకు తెలిసి మీరు ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే వారి గురించి మాట్లాడుతున్నట్లున్నారు. చిన్న సినిమాల్లో బాగా ఏక్ట్ చేసే హీరోలున్నారు. వాళ్లు కూడా పెద్ద హీరోలే నా దృష్టిలో. వాళ్లకీ టాలెంట్ వుంది. అలా అని ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునేవాళ్లలో టాలెంట్ లేదని కాదు. ఆ హీరోలు చేసే సినిమాలు చూస్తే, నా టైపు సినిమాలు వాళ్లు చేయరని నాకు అనిపిస్తుంది. అందుకనే నేను ఎప్పుడూ నా టైపు సినిమాలకు అప్రోచ్ కాలేదు.
- వాళ్లను అప్రోచ్ అయ్యేలాంటి కథలు మీరు తయారుచేయలేరా?
నేను బిజినెస్ మన్ ను కాదు. నాకు డబ్బులు కంటే పేరు ఎక్కువ ఇష్టం. నా సినిమాకు ఆడియన్స్ నా పేరు పోస్టర్ పై చూసి, అరె వీడు డిఫరెంట్ సినిమాలు తీస్తాడు. వీడి సినిమాలకు మనం వెళ్లాలి అనుకుంటూ రావాలి. ఫిల్మ్ మేకర్ గా నా క్రెడిబులిటీకి అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ క్రెడిబులిటీ పోతుందో, అప్పుడు సినిమాలు తీయడం మానేస్తాను. అంతేకానీ నా సినిమాకు ఫలానా హీరో వుందనో, హీరోయిన్ వుందనో రావడం నాకు పెద్దగా ఇష్టం లేదు.
- బడ్జెట్ మీద మీకు ఇంత కంట్రోలు ఎలా వచ్చింది. మీసినిమాలు 99శాతం చాలా ప్లాన్డ్ గా కంట్రోలుగా వుంటాయి?
నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. ఒకసారి కథ అనుకుని, ప్రీ పొడక్షన్ వర్క్ పూర్తయ్యాక, పొరపాటున కూడా దాంట్లోంచి ఒక్క శాతం డీవియేట్ కాను. నా సినిమాలో వాడని ఒక్క షాట్ కూడా ఎగస్ట్రా తీయను. అనుకున్నన్ని రోజుల్లోనే చేస్తాను, నా బడ్జెట్ కు ఫిట్ అయ్యే ఆర్టిస్టులనే పెట్టుకుంటాను. సినిమా ఓ ఎకనామికల్ గేమ్. మనకు ఎప్పుడూ డబ్బులు పోయేది ఎక్సెస్ బడ్జెట్ వల్లనే. మన కరెక్ట్ బడ్జెట్ డబ్బులు ఎప్పడూ వచ్చేస్తాయి.
- మీ బడ్జెట్ ప్లానింగ్ మీ చిత్రీకరణలో కూడా కనిపిస్తూ వుంటుంది..ఉదాహరణకు నచ్చావులే..
నిజమే. నచ్చావులే అనే సినిమా కేవలం మూడు వందల గజాల స్పేస్ లో చిత్రీకరించాం. అన్నీ అక్కడే జరుగుతాయి. ఆ కాస్త ప్లేస్ లోనే బ్రిడ్జి కట్టాం. కథ పైనా కిందా జరుగుతుంది. కానీ వేరు వేరు లొకేషన్లు అనిపిస్తాయి. మన కంటికి కనిపించేదే సినిమా. ప్రేక్షకుడి కన్ను పడేంత మేరకే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ కనిపించని దానికి ఎందుకు? అంతే కాదు సినిమాలో కనిపించేదాని గురించి ఎంతయినా ఖర్చు చేస్తాను. కనిపించని ఖర్చులు చాలా వుంటాయి. వాటికి మాత్రం ఖర్చు చేయను. కేరవాన్ లు లాంటివి.
Video: Ravi Babu Special Interview About Avunu 2
- టాలీవుడ్ కు నష్టాలు తప్పడం లేదు అనేవారంతా మీ ఆటిట్యూడ్ ను ఎందుకు అలవాటు చేసుకోవడం లేదు.?
రకరకాల జనాలు వుంటారు. నాకు తెలిసినంత వరకు నష్టం రావడం అనేది ఒకే ఒక రీజన్ వల్ల. అది బడ్జెట్ ఎక్కువ కావడం. సమస్య ఎక్కడ వస్తుదంటే, నేను ఓ సినిమా తీస్తాను. లాభాలు వస్తాయి. మళ్లీ సినిమా ప్రారంభించినపుడు ముందు సినిమా ఎంతలో చేయాలనుకున్నానో మరిచిపోతాను. ఎంత లాభం వచ్చిందో అంతలో తీయాలనుకుంటాను. అదే నా బడ్జెట్ అనుకుంటాను. అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటాను. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు మార్కెట్ ఏమి పెరిగిపోలేదు కదా? ఒక్క పక్క మార్కెట్ పెరగలేదు. సినిమాకు ఆడియన్స్ తగ్గుతున్నారు. అలాంటపుడు మరింత ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు ఎందుకు తీయాలి? ఇలా ఆలోచించి సినిమాలు తీస్తే వారికి కూడా నష్టాలు రావేమో అనుకుంటాను.
- రవిబాబు అంటే మంచి దర్శకుడే కాదు..మంచి నటుడు కూడా. కానీ మీరు ఎందుకు నటనపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు.
ఇంతకు ముందు ఓ రచయిత, దర్శకుడు కూర్చుని, కొందరు నటులను అనుకుని, వారికి తగిన పాత్రలను సృష్టించేవారు. సినిమాలో వున్న ప్రతి క్యారెక్టర్ ఇలా డ్రా చేసేవారు. రావుగోపాలరావు అంటే ఆయనకు తగ్గట్లు. ఇప్పుడు అలా జరగడం లేదు. ఒక్క హీరోల విషయంలోనే ఇలా చేస్తున్నారు. మిగిలినవి ఏ పాత్ర ఎవరైనా వేయచ్చు అన్నట్లు వుంటున్నాయి. చేయడానికి అంత ఆసక్తి కరంగా వున్న పాత్రలు ఏవీ రావడం లేదు. అలాంటివి వస్తే తప్పకుండా చేస్తాను.
- మళ్లీ మీ దగ్గర నుంచి మంచి లవ్ స్టోరీ ఎప్పుడు వస్తుంది?
చేస్తాను..దీని తరువాత. కానీ నాకు లవ్ స్టోరీలు చేయడానికి సమస్య ఏమిటంటే..అల్లరి నాటికి నచ్చావులే నాటికి సొసైటీలో వాల్యూస్ అన్నీ మారిపోయాయి. అక్కడి నుంచి నువ్విలాకు వచ్చేసరికి ఇంకా మారిపోయాయి. ఇప్పుడు ఇంకా మారిపోయాయి. మెబైల్ టెక్నాలజీ, ఇంటర్ నెట్, అన్నీ. ఒకప్పుడు ఓ అమ్మాయి పేరు తెలుసుకోవడానికి నెల పట్టేది. ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి ఇంకొన్నాళ్లు పట్టేవి. కానీ ఇప్పుడు క్షణాల్లో కలుసుకుంటున్నారు,. ఆ వెంటనే ఫొటోలు, ఆ తరువాత ఇంకోటి..ఇంకోటి.. ఇప్పుడు ఈ ట్రెండ్ కు అనుగుణంగా సినిమా తీయాలా? లేదా అసలు అప్పటి ట్రూ లవ్, ఆ ఎటర్నల్ లవ్ మీద సినిమా తీయాలా? అన్న కన్ఫూజన్ లో వున్నారంతా. నేను మాత్రం ఓ మాడ్రర్న్ లవ్ స్టోరీ తీస్తా. అసలు ఇవ్వాళ వున్నదేమిటి? లవ్ నా కాదా? ఫిజికల్ రిలేషిప్ నా అన్నదానిపై సినిమా చేస్తాను. ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీ అంటే ఎప్పటికైనా ఒకటే ఫార్ములా..అబ్బాయి..అమ్మాయి..కలవడం..విడిపోవడం..
Video: Ravi Babu Special Interview About Avunu 2
- ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న సోకాల్డ్ యూత్ సినిమాలు ఇలాంటివే కదా?
అంత డెప్త్ కు ఎక్స్ ప్లోర్ చేయడం లేదు వాటిల్లో. ఏదో పది పదిహేను క్రూడ్ జోక్ లు పెట్టేసి, ఇదే ప్రేమ అంటే అని చూపిస్తున్నారు. అలా కాకుండా వాళ్ల మైండ్ ను అర్థం చేసుకునేలా వుండాలి. వాళ్లు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. ట్రూలవ్ అన్నది తెలియకా? టైమ్ లేకనా?అన్నది చెప్పాలి.
- మీ సినిమాల పోస్టర్ల వ్యవహారమేమిటి? కేవలం జనాలను ఆకట్టుకోవడానికేనా..ఇంకేమైనా వుందా?
లేదు లేదు. నేను ఒక్క పోస్టరే వేస్తాను. నా ఒక్క పోస్టర్ డిజైన్ చేయడానికే రెండునెలలు పడుతుంది. దీంట్లో లాజిక్ ఏమిటంటే, నా చిన్నతనంలో బైక్ మీద వెళ్లేటపుడో మరొసారో, గోడలమీద చాలా పోస్టర్లు వుండేవి. కానీ ఒక్కదానిపైనే నా కన్ను పడేది. ఆ సినిమాకు వెళ్లాలి అనుకునే వాడిని, వెళ్లేవాడని. ఇప్పుడు కూడా అదే లాజిక్. గోడమీద పది పదిహేను పోస్టర్ లు వుంటాయి. వాటిలో నా పోస్టర్ కొట్టచ్చినట్లు కనపడాలి. నచ్చావులే చేసినపుడు సమస్య వచ్చింది. కొత్త అమ్మాయి..కొత్త అబ్బాయి. పోస్టర్ మీద ఏం వేయాలి. వాళ్ల ఫోటోలు వేస్తే జనం డిసైడ్ అయిపోతారు. వెళ్లాలా వద్దా అని. సినిమా బాగుంటుందని నాకు తెలుసు. కానీ పోస్టర్ చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారేమో? ఆఖరికి కుక్కపిల్లల్నీ, కోతుల్నీ చూపించా పోస్టర్లపై. కాస్త ఆసక్తి వచ్చింది ఆడియన్స్ కు.
- జనం దూరమవుతారని భయపడలేదా? ఏం సినిమానో ఏమిటో అని?
ఆ రిస్క్ కు ప్రిపేర్ అయిపోయాం. ఫస్ట్ డే కాకుండా సెకెండ్ డే తెలుస్తుంది కదా అనుకున్నాం
- అంతేనా? అవును పోస్టర్ ల ద్వారా సబ్జెక్ట్ కాస్త సూచించదలుచుకున్నారా?
భయంకరమైన ఆపదలో వుందీ అమ్మాయి అని చెప్పాలనుకున్నాం. డైనోసార్ లాంటివి మనకు సూట్ కావని ఏనుగు వాడం. ఇప్పుడు రెండు తలల ఏనుగుపెట్టాం. భయం రెట్టింపు, అనుభవం రెట్టింపు అని చెప్పేవన్నమాట.
- హాలీవుడ్ సినిమాల ప్రభావం మీమీద ఏ మేరకు?
నేను హాలీవుడ్ సినిమాలు చూసేదే నేర్చుకోవడం, తెలుసుకోవడం కోసం. అంతవరకే. అయితే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా మంచి సినిమాలు రావడం లేదు. మన థర్డ్ వరల్డ్ కంట్రీల ఆడియన్స్ చీప్ గ్రాఫిక్ సినిమాలను ఆదరిస్తున్నారని అవే తీస్తున్నారు. ఎనభై, తొంభైల్లో మంచి సినిమాలు వచ్చేవి. మే బి, చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు సినిమాలు చూడడం వల్ల నాలో నాకుతెలియకుండానే ఆ ప్రభావం వుందేమో?
Video: Ravi Babu Special Interview About Avunu 2
- తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రకటనలు రూపొందించిన వైనం ఏమిటి?
నాకు పొలిటికల్ అఫిలియేషన్లు ఏమీ లేవు. నేను అడ్వర్టైజింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. తెలుగుదేశం పార్టీ వాళ్లు చెన్నయ్ లో ఎవర్నో అడిగారు. వాళ్లు ఎందుకండీ..మీకు అక్కడే వున్నాడు కదా ఏడ్ ఫిల్మ్ మేకర్ అంటూ నా పేరు చెప్పారు. పిలిచారు. వెళ్లాను. వాళ్ల స్ట్రాటజీ ఏంటని అడిగాను. వాళ్లేదో చెప్పారు. నేను అది కాదు..మీ స్ట్రాటజీని మూడు పార్టులు అనుకుని చూడండి. తెలుగుదేశం పార్టికి వున్న ఒకే ఒక బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు. ఆయన పాస్టెన్స్ ఏమిటి? కామన్ మాన్ ఏమనుకుంటాడు అన్నది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ,. అని చెప్పాను..చేసాం. కానీ వాళ్లు కొంత ఫీలయ్యారు. అవతలి పార్టీ వాళ్ల ప్రకటనలు చాలా ఎగ్రెసివ్ గా వుంటున్నాయి మనవి సాఫ్ట్ గా వుంటున్నాయి అన్నారు. కానీ ఓవర్ పనికిరాదన్నాను. చంద్రబాబు నాకే ఓటేసారు. రెండోపార్ట్ లో ఆయన వస్తే బాగుంటుంది అన్నది చెప్పాను. ఆ తరువాత మూడో పార్ట్ చేసాం. లక్కీగా సక్సెస్ అయ్యాం. నా ఇంట్రస్ట్ ఇందులో ఒక్కటే,. అన్నిరకాల అడ్వర్ టైజ్ మెంట్ లు చేసాను. కానీ పొలిటికల్ చేయలేదు. అదో మంచి అనుభవం అయింది.
- తరువాత మళ్లీ చంద్రబాబును కలిసారా?
జస్ట్ కొద్దిగా. ఎక్కడో కలిసాం..థాంక్యూ రవీ గుడ్ జాబ్ అన్నారు. నా సమస్య ఏమిటంటే, ఓ పని అయిపోయాక దాని నుంచి డిస్ కనెక్ట్ అయిపోతాను.
- ఈ తరహా డిఫరెంట్ మెంటాలిటీ మీకు అలవడ్డానికి కారణం పెరిగిన వాతావరణమా?
నేను ఫండమెంటల్ గా ఎవర్నించి ఏమీ ఆశించను. నేను అయితే పనిలోవుంటాను. లేదా ఇంట్లో వుంటాను. నన్ను మీరు ఎక్కడా పార్టీల్లో చూడరు. అందువల్ల నాకు చాలా ఫ్రీ టైమ్ దొరకుతుంది. పని చేసుకుంటాను. జెనిటిక్ ఏమో? మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రయివసీకి ఇంపార్టెన్స్ ఇస్తాం.
- ఈ సినిమా బడ్జెట్ ఎంతయింది.?
ఇది నేను సురేష్ బాబు కలిసి చేస్తున్న అయిదో సినిమా. మా లెక్కలు వేరుగా వుంటాయి. బడ్జెట్ అనేది నిర్మాత కంట్రోల్ లో వుంటుంది.
- బడ్జెట్ అనేది ఇఫ్పుడు హీరోల కంట్రోల్ లో వుందేమో?
నేను అలా అనుకోవడం లేదు. ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్ గా వుంటే ఈ సమస్య రాదు. ఇక్కడ అందరూ కళ్లు తెరిచే వ్యాపారం చేస్తున్నారు. కళ్లు మూసుకుని ఎవరూలేరు. లాభం వస్తుందనే కదా పెట్టుబడి పెడుతున్నారు. వస్తే మీరే తీసుకుంటారు. నష్టం వచ్చినా మీదే. ఎవరు ఈ వ్యాపారం లోకి రమ్మని పిలిచారు. నచ్చి వచ్చారు. అలాంపుడు ఎవర్ని బ్లేమ్ చేయాలి?
Video: Ravi Babu Special Interview About Avunu 2
- పూర్ణతో సినిమాలు చేయడం ఎలావుంది.?
నేను ఎంతో మందితో చేసాను. కానీ పూర్ణకు వున్నంత టైమింగ్, స్పాంటేనియానిటీ, డెడికేషన్ అన్నీ అద్భుతం. భరతనాట్యం డ్యానర్స్ అవడం, వర్క్ మీద కాన్సన్ ట్రేషన్, ఆ అమ్మాయి పెట్టే ఎఫెర్ట్ అలా వుంటుంది. నేను టేక్ 2 అనడానికి జంకుతాను ఆమెదగ్గర. అంత మంచి అవుట్ పుట్ ఇస్తుంది.
- మన కమర్షియల్ సినిమాలు ఇక ఇలా వుండాల్సిందేనా?
నేను కూడా అనుకున్నాను. బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేష్ కాలం మారుతోంది. కొత్త కుర్రాళ్లు, వాళ్ల పిల్లలు వస్తున్నారు వీళ్లయినా డిఫరెంట్ సినిమాలు చేస్తారేమో అని. కానీ వీళ్లు కూడా వాళ్లకన్నా వాణిజ్యపరమైన సినిమాలు చేస్తున్నారు.
- కారణం ఏమిటంటారు?
ఎవర్నీ నిందించలేం. ఓ డైరక్టర్ ఏ గోదావరి జిల్లాలోని పల్లెటూరిలోనో, పట్నంలోనో పెరుగుతాడు. ఎన్టీఆర్,చిరంజీవి, బాలయ్య సినిమాలు చూసి సినిమాల్లోకి వస్తాడు. తనకు అదే తెలుసు. అదే తీస్తాడు. హిట్ అవుతుంది. దాంతో అదే ఫార్ములా అనుకుంటాడు. అలాగే వెళ్లాడు.
- ఈ పరిస్థితి ఇలా సాగాల్సిందేనా?
చూదాం..ఎప్పటికైనా మారుతుందేమో?
- థాంక్యూ
థాంక్యూ
చాణక్య