అనుష్క అంతే..ఒకసారి ఓ సినిమా అవకాశం ఇస్తే, మళ్లీ తమ తమ సినిమాలకు ఆమే కావాలనుకుంటారు. ఆమె చరిష్మా అలాంటిది. ఇప్పుడు తాజాగా పివిపి సంస్థ కు అనుష్క అంటే అభిమానం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
ముందు భారీగా వర్ణ సినిమా తీసారు. అక్కడితో ఆగలేదు. విజయవాడ పివిపి మాల్ ను సచిన్ తో కలిసి అనుష్క ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు తనయడు ప్రకాష్ తీస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో హీరోయిన్ అనుష్కనే. దీనికి నిర్మాత పివిపి సంస్థే.
ఇక మిగిలిపోయింది కార్తీ-నాగ్ హీరోలుగా పివిపి నిర్మించే సినిమానే. అందులో నాగ్ పక్కన అనుష్కను తీసుకుంటే హ్యాట్రిక్ అయిపోతుంది. నాగ్-అనుష్క ఇంతకు ముందే హాట్ పెయిర్ గా ప్రూవ్ చేసుకున్న జంటే కూడా.