బాహుబలి లాంటి బృహత్తర ప్రాజెక్టు తలకెత్తుకున్నాడు రాజమౌళి. శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు. రాజమౌళి వాటా సంగతి సరేసరి. అయితే భారీ తారాగణం, భారీ నిర్మాణ వ్యయం కావడంతో ఇప్పుడు కాస్త కిందా మీదా అవుతున్నారని వినికిడి. అప్పటికీ మొదటిభాగం విడుదల హక్కులు కొన్ని ఏరియాలు ఓవర్ సీస్ అమ్మారు. దాని వల్ల కొంతవరకు పని నడిచింది. ఇప్పుడు అసలైన పోస్టు ప్రొడక్షన్ పనులు వున్నాయి. సెకండ్ పార్ట్ లో కొంత టాకీ మిగిలి వుంది.
ముందు టాకీ మొత్తం చేసేయాలా..కాస్త బకాయి వుంచి, మొదటి భాగం విడుదల అనంతరం చేయాలా అన్నది ఇఫ్పుడు కాస్త డిస్కషన్ లో వుందని, ఆర్టిస్టులను ఈ సినిమాకి పనికి వచ్చే గెటప్ లతో ఇంకా ఎంతకాలం అట్టేపెట్టగలమన్నది ఓసమస్య. ఎక్కడలేని డబ్బులు టాకీకి ఖర్చు చేస్తే, పోస్టుప్రొడక్షన్ సంగతేమిటన్నది మరో సమస్య.
అందుకే తొలిభాగం పూర్తి చేసి, విడుదల చేసి, చేయితిరిగాక, రెండో భాగం చేయాలన్నది నిర్ణయమని ఓ వార్త. ఇలా వార్తలు వినిపించినపుడల్లా రాజమౌళి ట్వీట్ చేసి ఏదో ఒకటి చెబుతుంటారు. ఈ సారి ఏం చెబుతారో?