ఇప్పుడు నడుస్తున్నదంతా కన్ఫూజ్ కామెడీ లేదా సస్సెన్స్ థ్రిల్లర్ కాదంటే, హర్రర్. అందుకే అలాంటి సబ్జెక్ట్ లు ఎక్కడున్నాయి అని వలేసి గాలిస్తున్నారు. మంచు విష్ణు అలాంటి సబ్జెక్ట్ ను ఒకదాన్ని చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.
పంజాబీ భాషలో రెండేళ్ల క్రితం వచ్చి, హిట్ అయినా చిన్న సినిమా 'క్యారీ ఆన్ జత్తా' అన్న సినిమా హక్కులు మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు. ఇది ఓ యువజంట ఫన్నీ కామెడీ ఎపిసోడ్. అత్తామామల పోరు లేకుండా వుండడం కోసం ఒంటరి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుది ఓ అమ్మాయి. కానీ అనుకోకుండా, తెలియకుండా అందరూ వున్న కుర్రాడిని చేసుకుంటుంది.
దాంతో తన ఇంట్లో తనవాళ్లతో, భార్యతో కలిసి వుంటూనే, ఎవరూ తమ వాళ్లు కాదనే డ్రామా నడపాల్సి వస్తుంది. అదీ కథాంశం. ఈ సినిమా విష్ణకు చక్కగా సూటవుతుంది. అందుకే హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరి చేతిలో పెడతాడో దీన్ని. ఇలాంటివి కోన బ్యాచ్ అయితే విరగదీస్తారు మరి.