దర్శకుడు త్రివిక్రమ్ యూనిట్ తో పరిచయం వున్న సినిమా జనాలకు సాయి కూడా పరిచయమే. త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి అన్ని వ్యవహారాలు సాయే చూసుకుంటారని అంటారు అంతా. ఆఖరికి ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా. ఆ ఇద్దరి బంధం చిరకాలంగా సాగుతోంది. అలాంటిది సత్యమూర్తి విశాఖ ఫంక్షన్ జరిగిన మర్నాడే సాయి – త్రివిక్రమ్ దగ్గర కొలువుకు గుడ్ బై చెప్పేసారని తెలుస్తోంది.
ఇందులో ప్రత్యేకించి కారణం అంటూ ఏమీ లేదని, చాలా కాలంగా ఒకె చోట వుండడం వల్ల, ఫర్ ఏ ఛేంజ్ అన్నది తప్ప వేరు కాదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కానీ త్రివిక్రమ్ తో చాలా సన్నిహితం వున్న సాయి మానేసారంటే, సమ్ థింగ్ వుండి వుండాలని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సాయి మానేయలేదని, వేరే తన స్క్రిప్ట్ పనుల మీద బిజీగా వున్నారనీ వెర్షన్ కూడా వినిపిస్తోంది. అయితే అన్నింటి కన్నా బలంగా వినిపిస్తున్నది మానేసారనే.