2 లక్షల జనాభా దేశం చేతిలో 100కోట్ల దేశం చిత్తైంది!

గ్వామ్.. ఈ దేశం పేరును కూడా చాలా మంది విని ఉండరు. పసిపిక్ మహా సముద్ర పశ్చిమ భాగంలో ఉంటుంది ఈ దేశం. ఈ దీవి జనాభా కేవలం రెండు లక్షలు మాత్రమే! మరి…

గ్వామ్.. ఈ దేశం పేరును కూడా చాలా మంది విని ఉండరు. పసిపిక్ మహా సముద్ర పశ్చిమ భాగంలో ఉంటుంది ఈ దేశం. ఈ దీవి జనాభా కేవలం రెండు లక్షలు మాత్రమే! మరి ఇప్పుడు ఈ దేశం ఎందుకు మనదేశపు వార్తల్లోకి వచ్చిదంటే.. ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ ను ఆ దేశపు జట్టు చిత్తు చేసింది. ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో ఇండియాపై గ్వామ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇండియా రెండో ఓటమిని మూటగట్టుకొంది. సాకర్ ప్రపంచకప్ కు క్లాలిఫై అయ్యే అవకాశాలను మరింత మృగ్యం చేసుకొంది.

మరి ఇండియాలో ఫుట్ బాల్ కు అంత ఆదరణ లేదు.. కాబట్టి గ్వామ్ చేతిలో ఓడి ఉండవచ్చని అనుకోవచ్చు. కానీ పిఫా ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకొంటే గ్వామ్ ఇండియా కన్నా చాలా వెనుకబడి ఉంది. 33 ర్యాంకులు వెనుక ఉంది. అయినా కూడా ఇండియన్ జట్టుపై ఆ దేశపు జట్టు విజయం సాధించింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది భారత దేశం. ఈ దేశ జనాభా వంద కోట్లపై స్థాయిలో ఉంది. మన జనాభాతో పోలిస్తే… గ్వామ్ దేశ జనాభా సముద్రంలో కాకిరెట్టంత! 120 కోట్ల తో పోలిస్తే.. రెండు లక్షల జనాభా ఏ మూలకో అర్థం చేసుకోవచ్చు. అయితేనేం.. ఇండియా ను గ్వామ్ ఓడించింది!