పవన్.. అర్థంపర్థం లేని సలహాలు తగవు!

పాఠశాలల్లో విద్యార్థులకు నెక్ట్స్ లెవెల్ విద్యా వసతులను అందుబాటులో ఉంచడానికి.. జగన్ సర్కారు 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ లు అందజేస్తోంది. వీటిద్వారా.. వారి చదువుల్లో ప్రమాణాలు మెరుగుపడతాయనేది ప్రభుత్వం ఆశ. ఆ మేరకు…

పాఠశాలల్లో విద్యార్థులకు నెక్ట్స్ లెవెల్ విద్యా వసతులను అందుబాటులో ఉంచడానికి.. జగన్ సర్కారు 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ లు అందజేస్తోంది. వీటిద్వారా.. వారి చదువుల్లో ప్రమాణాలు మెరుగుపడతాయనేది ప్రభుత్వం ఆశ. ఆ మేరకు జరుగుతోంది కూడా. 

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు విదేశీ విద్యలకు కూడా తగిన రీతిలో సుశిక్షితులు కావాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. జగన్ సర్కారు చేసే ప్రతి పనినీ విమర్శిస్తూ సాగే పవన్ కల్యాణ్ ట్యాబ్ ల గురించి ఏమైనా మాట్లాడితే ప్రజలు తననే అసహ్యించుకుంటారని భయపడుతున్నారో ఏమో గానీ.. అవి మంచివే అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఇతర విమర్శలు చేయడానికి సాహసిస్తున్నారు.

‘ట్యాబ్ లు మంచిదే గానీ.. పాఠశాలల్లో ముందు మరుగుదొడ్లు ఉండాలి’ అని పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు. ఈ మాటలు విన్నప్పుడు.. ‘ఆహా.. జనసేనానికి విద్యార్థుల కష్టాల గురించి ఎంత అద్భుతమైన కన్సర్న్ ఉన్నదో కదా అనిపిస్తుంది. ఆయన శ్రద్ధకు నీరాజనాలు పట్టాలి అనిపిస్తుంది. ఎంతో ప్రాక్టికాలిటీతో మాట్లాడుతున్న పవన్ లాంటి నాయకులు.. ఈ జాతికి అవసరం అని ఆయన వందిమాగధులు ప్రచారం చేసుకున్నా సరే సబబుగానే అనిపిస్తుంది.

అయితే.. పవన్ ఏ ఆధారాలతో ఇలాంటి అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇప్పుడు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని ఆయన ఎలా చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రెవేటు పాఠశాలలను తలదన్నే అద్భుత భవనాలుగా మార్చేసే ప్రయత్నాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు మాత్రమే కాదు కదా.. భోజనం చేశాక చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్లు వంటి ఆధునాతన ఏర్పాట్లు కూడా వస్తున్నాయి. 

వంద మంది విద్యార్థులు కూడా ఉండని చిన్న చిన్న ప్రాథమి పాఠశాలల్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. ప్రెవేటు స్కూళ్లలో చదువుతున్న వారు కూడా వచ్చి చేరుతున్నారు. అతిశయంగా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలు నమ్మశక్యం కానంత స్వర్గ ధామాలుగా మారుతున్నాయి.

అయితే ఇదంతా కూడా దశలవారీగా జరుగుతోంది. రాష్ట్రంలోని వంద శాతం స్కూళ్లు ఇలా అద్భుతాలు అయ్యాయని అనలేం. ఏ పని అయినా దశల వారీగానే జరుగుతుంది. బడులు కూడా ఇంకా కొన్ని వసతుల లేమితో ఉన్నాయి. వాటినికూడా బాగుచేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. 

అయితే.. ఎక్కడో హైదరాబాదులో నివసిస్తూ, షూటింగ్ గ్యాప్ లో రాజకీయం చేయాలని , సీఎం అయిపోవాలని ఆరాటపడుతూ.. తోచిన చెత్త అంతా మాట్లాడే పవన్ కల్యాణ్ , మాట్లాడేముందు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది.