ఒక్కప్పటి చిన్న హీరో. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టు సురేష్. కోరి కోరి ట్విట్టర్ లో రాజమౌళి బాహుబలిని కెలుకుతున్నాడు. ఎపి మొత్తం వెయిట్ చేస్తోంది. ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది..ఎవడికి పట్టింది..అంటూ బాహుబలిని తీసిపారేస్తున్నాడు. ఇంతకీ అతగాడి బాధేంటంటే..సాయికుమార్, జగపతిబాబు, సుమన్, ఇంకా తన లాంటి సీనియర్లను తీసుకోకుండా నాజర్, సత్యరాజ్ వంటి పక్కరాష్ట్రం వారిని తీసుకోవడం ఏమిటి అన్నది.
కట్టప్ప పాత్రకు సత్యరాజ్ కన్నా సూటయ్యేవారే లేరా అంటూ ప్రశ్నిస్తున్నాడు. కానీ ఇక్కడ సురేష్ తెలుసుకోవాల్సిన సంగతులు చాలా వున్నాయి. ఓ పాత్రకు నటుడి ఎంపిక అన్నది చాలా విషయాలపై ఆధారపడి వుంటుంది. సినమా రేంజ్, వివిధ భాషలకు అనువదించాల్సిన అవసరం.
అక్కడి ప్రేక్షకులకు పరిచయం అయిన ఫేస్ లు, ఇంకా ఇలా చాలా చాలా. అయినా సురేష్ ఇంత డీప్ గా ఆలోచించేటుపుడు, తను క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సినిమాల్లో హిట్ అనిపించుకున్నవి ఎన్నో ఓసారి లెక్కేసుకోరాదా? సినిమా జనాలకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ.