మళ్లీ…ఆగడా? దూకుడా?

మ‌హేష్ బాబు – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్లో మ‌రో సినిమా రాబోతోందా??  ఈ సినిమాని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోందా??  ప్రస్తుతం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఈ టాపిక్ గురించే హాట్ హాట్ గా చ‌ర్చించుకొంటున్నారు. దూకుడు లాంటి…

మ‌హేష్ బాబు – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్లో మ‌రో సినిమా రాబోతోందా??  ఈ సినిమాని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోందా??  ప్రస్తుతం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఈ టాపిక్ గురించే హాట్ హాట్ గా చ‌ర్చించుకొంటున్నారు. దూకుడు లాంటి సూప‌ర్‌హిట్ త‌ర‌వాత మ‌హేష్ – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్లో 'ఆగ‌డు' వ‌చ్చింది.

అదికాస్త ఆట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఫ్లాప్ అవ్వడ‌మే కాదు, ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు చెల‌రేగాయి. మ‌హేష్ ఇమేజ్‌ని  క్యాష్ చేసుకొనే ఉద్దేశంలో శ్రీ‌నువైట్ల క‌థ‌, క‌థ‌నాల గురించి ప‌ట్టించుకోలేద‌ని, ఓవ‌ర్‌కాన్ఫిడెన్స్‌తో మ‌హేష్‌ని కూడా త‌ప్పుదోవ ప‌ట్టించాడ‌న్న నింద‌లు మోయాల్సివ‌చ్చింది. 

మ‌హేష్ కూడా శ్రీ‌నువైట్లకి చివాట్లు పెట్టాడ‌ని మీడియాలో వార్తలు గుప్పుమ‌న్నాయి. ఈనేప‌థ్యంలో మ‌హేష్ మ‌ళ్లీ శ్రీ‌నువైట్లని న‌మ్మి ఆ త‌ప్పు చేస్తాడా అన్నది అనుమాన‌మే. మ‌హేష్ – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ అంటే ఇప్పటికీ బోల్డంత క్రేజ్ ఉంది. 

ఈసారి శ్రీ‌నువైట్ల జాగ్రత్తగా మ‌సులుకొంటే.. దూకుడులాంటి ఫీట్ మ‌ళ్లీ సాధించొచ్చు కూడా. శ్రీ‌నువైట్ల మ‌హేష్‌ని గ‌నుక ఒప్పించాలంటే అదిరిపోయే క‌థ సిద్ధం చేయాలి. మ‌రి శ్రీ‌ను వైట్ల ద‌గ్గర మ్యాజిక్ చేయ‌గ‌ల క‌థ ఉందా?  లేదా? అనేదాన్ని బ‌ట్టే వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ ఆధార‌ప‌డి ఉంటుంది.