ఎన్టీఆర్‌ పేరుతో పండగ చేసుకుంటున్నారు

‘రభస’ రిలీజ్‌ వాయిదా పడడంతో చిన్న సినిమాలకి రెక్కలొచ్చాయి. రభస రిలీజ్‌ అయితే తమ చిత్రాల్ని ఎక్కడ వారం రోజుల్లో ఎత్తేస్తారో అని కంగారు పడ్డ నిర్మాతలు ఇప్పుడు ధీమాగా సినిమాలు విడుదల చేస్తున్నారు.…

‘రభస’ రిలీజ్‌ వాయిదా పడడంతో చిన్న సినిమాలకి రెక్కలొచ్చాయి. రభస రిలీజ్‌ అయితే తమ చిత్రాల్ని ఎక్కడ వారం రోజుల్లో ఎత్తేస్తారో అని కంగారు పడ్డ నిర్మాతలు ఇప్పుడు ధీమాగా సినిమాలు విడుదల చేస్తున్నారు. అలాగే ఆగస్ట్‌ 15న రభస లేకపోవడంతో అప్పటికి విడుదల చేసుకోవాలని ప్లాన్‌ చేసుకుంటోన్న సినిమాలకీ లైన్‌ క్లియర్‌ అయిపోయింది. 

రభస ఒక్కటి రాకపోతే కనీసం అయిదారు చిన్న సినిమాలకి థియేటర్లు దొరుకుతాయి. దీంతో కొత్త సినిమాలకి మంచి డేట్‌ అని భావిస్తోన్న ఇండిపెండెన్స్‌ డే వీక్‌ మీద అందరి కన్ను పడింది. ఈ వారంలో గాలిపటం, గీతాంజలి చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. అలాగే ఆగస్టు 15న సూర్య నటించిన అనువాద చిత్రం సికిందర్‌ రిలీజ్‌ కానుంది. 

అదే రోజున మారుతి నిర్మించిన లవర్స్‌తో పాటు మంచు విష్ణు నటించిన అనుక్షణం రిలీజ్‌ అవుతోంది. ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న సినిమాలు కూడా బలవంతంగా తొలగించాల్సిన పని లేకపోవడంతో ఆ సినిమాల బయ్యర్లు కూడా సంబరపడుతున్నారు. రభస రాకపోవడం వల్ల ఇంతమందికి కలిసొచ్చిందన్నమాట.