మహేష్‌బాబుతో వి.వి. వినాయక్‌

మహేష్‌బాబు హీరోగా వి.వి. వినాయక్‌ సినిమా ఉంటుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, వినాయక్‌ తదుపరి చిత్రం ఇదేనని టాక్‌ వినిపిస్తోంది. మరి చిరంజీవి 150వ సినిమా ఏమైనట్టు?…

మహేష్‌బాబు హీరోగా వి.వి. వినాయక్‌ సినిమా ఉంటుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, వినాయక్‌ తదుపరి చిత్రం ఇదేనని టాక్‌ వినిపిస్తోంది. మరి చిరంజీవి 150వ సినిమా ఏమైనట్టు? చిరు రీఎంట్రీ జరిగేది వినాయక్‌ డైరెక్షన్‌లోనే అని ఖచ్చితమైన వార్తలు వస్తుండగా దానికిదో కొత్త ట్విస్టు. 

మహేష్‌ ఇంతవరకు వినాయక్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. స్టార్‌ డైరెక్టర్లలో వినాయక్‌, రాజమౌళితో మినహా మహేష్‌ అందరితో పని చేసాడు. ఈమధ్య మాస్‌ ఎంటర్‌టైనర్స్‌పై మొగ్గు చూపుతోన్న మహేష్‌ అందులో భాగంగానే వినాయక్‌తో సినిమా కన్సిడర్‌ చేస్తున్నట్టున్నాడు. 

మాస్‌ మెచ్చే ఎంటర్‌టైనర్స్‌ తీయడంలో సిద్ధ హస్తుడు అనిపించుకున్న వినాయక్‌ వరుసపెట్టి విజయాలు సాధిస్తున్నాడు. ఆగడులో ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ మాస్‌ క్యారెక్టర్‌ చేస్తోన్న మహేష్‌ తదుపరి చేస్తోన్న కొరటాల శివ చిత్రం కూడా మాస్‌ని టార్గెట్‌ చేసినదే. ఇప్పుడు వినాయక్‌తో సినిమా అంటే మహేష్‌ మాస్‌ని మరింత ఆకట్టుకోవడంపై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టినట్టున్నాడు.