రామ్ చరణ్ గిఫ్ట్.. మొహంమీదే తిప్పికొట్టిన ఉపాసన

అమ్మాయిలు ఇష్టపడే బహుమతులు ఇవ్వడంలో తను చాలా వీక్ అంటున్నాడు రామ్ చరణ్. ఓసారి ఇలానే ఉపాసనకు ఓ గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడట. బహుమతి చూసిన 5 సెకన్లకే తిరిగి చరణ్ మొహం…

అమ్మాయిలు ఇష్టపడే బహుమతులు ఇవ్వడంలో తను చాలా వీక్ అంటున్నాడు రామ్ చరణ్. ఓసారి ఇలానే ఉపాసనకు ఓ గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడట. బహుమతి చూసిన 5 సెకన్లకే తిరిగి చరణ్ మొహం మీద కొట్టిందట ఉపాసన.

“అమ్మాయిలకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలో అబ్బాయిలకు అస్సలు తెలియదు. ఈ విషయంలో నేను ఇంకా వీక్. పెళ్లయిన కొత్తలో నా భార్యకు గిఫ్ట్ ఇస్తే, నా మొహం మీదే తిప్పికొట్టింది. నా భార్యకు చాలా ఖరీదైన గిఫ్ట్ కొన్నాను. అది చూసి మా ఆవిడ ఫ్లాట్ అయిపోతుందనుకున్నాను. కానీ చూసిన 5 సెకెన్లకే తిరస్కరించింది. దాన్ని సెలక్ట్ చేసి కొనడానికి నాకు 5 గంటలు పట్టింది. చాలా దూరంగా ఉన్న ఓ షాప్ కు వెళ్లి మరీ కొన్నాను.”

భార్య, ప్రేయసి లేదా సిస్టర్ కు బహుమతులు ఇవ్వాలనుకునే అబ్బాయిలకు ఓ ఉచిత సలహా ఇస్తున్నాడు చరణ్. అమ్మాయిల్ని సర్ ప్రైజ్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దని, వాళ్లకు ముందుగా గిఫ్ట్ చూపించి, వాళ్లకు నచ్చింది కొనివ్వడమే ఉత్తమమైన మార్గమని చెబుతున్నాడు. అమ్మాయిలకు సర్ ప్రైజెస్ అంటే అస్సలు నచ్చవని తన సొంత అనుభవంతో చెబుతున్నాడు.

ఇక తన వ్యక్తిగత కలెక్షన్ విషయానికొస్తే, వాచీలు సేకరించడం చరణ్ కు ఇష్టం అంట. ఇప్పటికే అతడి దగ్గర 15 ఖరీదైన వాచీలున్నాయంట. కరోనా టైమ్ లో తనకు ఎంతో ఇష్టమైన క్యాసియో వాచ్ ను ఆన్ లైన్ లో కొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.