త్రివిక్రమ్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా

అయితే అటు లేకుంటే ఇటు అన్నది పూరి జగన్నాధ్, ఆర్జీవీల స్టయిల్. ఇప్పుడు అదే లైన్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది దర్శకుడు త్రివిక్రమ్ కూడా. పెద్ద హీరోలతో సినిమా చేద్దామంటే కనుచూపు మేరలో ఎవరూ…

అయితే అటు లేకుంటే ఇటు అన్నది పూరి జగన్నాధ్, ఆర్జీవీల స్టయిల్. ఇప్పుడు అదే లైన్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది దర్శకుడు త్రివిక్రమ్ కూడా. పెద్ద హీరోలతో సినిమా చేద్దామంటే కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు. అందువల్ల కనీసం మరో ఆరు నెలలు ఆగితే తప్ప మరే హీరో దొరికేలా లేడు. 

అందుకే త్రివిక్రమ్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన దైన స్టయిల్ లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా హారిక హాసిని అధినేత చిన్నబాబు (రాధాకృష్ణ) నిర్మిస్తారు. అయితే అంత టాలెంట్ వున్న హీరోయిన్ ఎవరు? ఈ సినిమాకు ఎంపికవుతారు? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. 

సమంత అని ఓ టాక్ వినిపిస్తోంది. కాదనీ వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంపికైనా సరే ఒకటి మాత్రం వాస్తవం. త్రివిక్రమ్ లాంటి టాలెంటెడ్ రైటర్, డైరక్టర్ హీరోలతో కాకుండా ఇలాంటి సినిమా చేస్తే, కచ్చితంగా మంచి పవర్ ఫుల్ గా వుంటుందన్నది వాస్తవం.