గీతాంజలికి సెన్సారు కష్టం

కోనవెంకట్ గీతాంజలి 8న విడుదల కావాల్సి వుంది. అవసరమైతే ఓ రోజు వెనుకగా రావాలని యూనిట్ చూస్తోందని వినికిడి. కారణం మరేమీ లేదు. ఈ రోజు వరకు సెన్సారు కాకపోవడమే. సెన్సారు అధికారిణి ఆఖరుకు…

కోనవెంకట్ గీతాంజలి 8న విడుదల కావాల్సి వుంది. అవసరమైతే ఓ రోజు వెనుకగా రావాలని యూనిట్ చూస్తోందని వినికిడి. కారణం మరేమీ లేదు. ఈ రోజు వరకు సెన్సారు కాకపోవడమే. సెన్సారు అధికారిణి ఆఖరుకు బుదవారం చూస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు సెన్సారు అయితే 8న  లేకుంటే 9న విడుదలయ్యే అవకాశం వుంది. 

ఇదిలా వుంటే నిజమో కాదో తెలియదు కానీ,. ఓ రూమర్ కూడా స్ప్రెడ్ అవుతోంది. సెన్సారు అధికారిణి సినిమా చూడకపోవడంతో వత్తిడి తెచ్చేందుకే దర్శకుడు రాజ్ కిరణ్ అనారోగ్య వ్యవహారం సెన్సారు అధికారిణిపై వత్తిడి తెచ్చేందుకే అని కొందరు, లేదు నిజంగానే టెన్షన్ తట్టుకోలేక ఆసుప్రతిపాలయ్యారని మరికొందరు అంటున్నారు.