మారుతి-దానయ్య తకరారు?

మారుతి సరైన సినిమా చేద్దామంటే చాలా తలకాయనొప్పులు వచ్చి పడుతున్నాయి. టైం అంతగా బాగున్నట్లు లేదు. వెంకటేష్ తో రాధ అనకుంటే అది జరగలేదు. తరువాత మాంచి కథ తీసుకుని సునీల్ తో చేద్దామనుకుంటే,…

మారుతి సరైన సినిమా చేద్దామంటే చాలా తలకాయనొప్పులు వచ్చి పడుతున్నాయి. టైం అంతగా బాగున్నట్లు లేదు. వెంకటేష్ తో రాధ అనకుంటే అది జరగలేదు. తరువాత మాంచి కథ తీసుకుని సునీల్ తో చేద్దామనుకుంటే, ఆయన ఇన్ వాల్వ్ మెంట్ భరించలేకపోయారు. ఆఖరికి నానితో ఫైనల్ అయింది అనుకుంటే కొత్త రకం ఇబ్బందులు వచ్చాయి. 

మారుతి దగ్గర నలుగురైదురికి అడ్వాన్స్ లు వాటిలో దానయ్య, యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కూడా వున్నాయి. నానితో సినిమా దానయ్యకు ఇష్టం లేదు. యువి వాళ్లు, నానితో చేయచ్చు కానీ, ఇంకా కాస్త పెద్ద సినిమా చేద్దామన్న ఆలోచనలో వున్నారు. పోనీ గీతా ఆర్ట్స్ సై అంటుంది అనుకున్న టైమ్ లో దానయ్య అడ్డం పడుతున్నట్లు తెలిసింది. 

ముందు తనకు సినిమా చేసాకే మరే సినిమా అయినా అని అంటున్నట్లు వినకిడి. కానీ ఆయనకు నాని సినిమా వద్దు. మరెలా? ఈ తకరారు తెగడానికి ఇప్పుడు సిటింగ్ ల మీద సిటింగ్ లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.​