నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో ఇంకా నిర్మాతలకి క్లారిటీ రాలేదు. సెప్టెంబర్ నెలాఖరులో ఆగడు, అక్టోబర్ మొదటి వారంలో గోవిందుడు అందరివాడేలే విడుదల కానున్నాయి.
ఈ రెండు చిత్రాలు ఉండడం వల్ల దసరా సీజన్‌ని మిస్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఏది బెటర్ సీజన్ అనే దానిపై చర్చించకుంటున్నారు. దీపావళికి విడుదల చేసినా కానీ తెలుగు సినిమాకి సంబంధించి అది అంత గొప్ప సీజన్ కాదు. అంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. సంక్రాంతికి కూడా భారీ చిత్రాలు చాలానే ఉంటాయి కనుక వరుణ్ తేజ్ చిత్రానికి ముహూర్తం కుదరడం లేదు.
ఈ చిత్రాన్ని అగ్ర హీరోల సినిమాలకి ధీటుగానే విడుదల చేయాలని చూస్తున్నారు. మెగా ఫాన్స్ వరుణ్ తేజ్ ఎంట్రీపై ఎక్సయిటింగ్‌గా ఉన్నారు కనుక ఓపెనింగ్స్ బాగుంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే అందుకోసం మంచి రిలీజ్ డేట్ కూడా కుదరాలి. ప్రస్తుతం రెండు చెప్పుకోతగ్గ సినిమాలు మార్కెట్‌లో ఉంటే కొత్త చిత్రాలకి థియేటర్లు చాలని పరిస్థితి నెలకొంది.