సౌత్ నుంచి నార్త్‌కి వెళ్లిన హీరోయిన్లలో చాలా మంది సక్సెస్ అయ్యారు. కొందరు అడపాదడపా హిందీ సినిమాలు చేస్తూ ఇక్కడ కూడా ఆఫర్లు నిలబెట్టుకుంటూ ఉంటే… ఇంకొందరు హిందీ సినిమాని సీరియస్‌గా తీసుకుని, సౌత్ చిత్రాల్ని లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడ పదేళ్లకి పైగానే రూల్ చేసిన త్రిష మాత్రం బాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది.
కేవలం ఒకే ఒక్క హిందీ చిత్రంలో నటించిన త్రిష ‘కట్టా మీఠా’ తర్వాత మళ్లీ అటువైపు చూడను కూడా చూడలేదు. ఆ తర్వాత కూడా కొన్ని అవకాశాలైతే వచ్చాయి కానీ ఏవీ ఎక్సయిటింగ్‌గా అనిపించలేదని, హిందీలో వరుసగా సినిమాలు చేస్తే ఇక దక్షిణాదికి ఎక్కువ టైమ్ కేటాయించలేమని త్రిష చెప్పింది. హిందీ చిత్రాలకి పబ్లిసిటీ కోసమే రెండు, మూడు నెలలు కేటాయించాలని, దాని కోసం సౌత్ సినిమాలు తగ్గించుకోవాలని, అందుకే బాలీవుడ్‌కి తిరిగి వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పింది.
ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో, తమిళంలో అజిత్‌తో, కన్నడలో ఓ చిత్రంలో నటిస్తోన్న త్రిష ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంటోంది. నటిగా సాధించాల్సింది చాలా ఉందని, అందుకే పెళ్లిని మరో రెండు, మూడేళ్ల వరకు వాయిదా వేసానని చెప్పింది.