‘అల్లుడి’ కోసం రభస వెనక్కి?

ఎన్టీఆర్ అభిమానులు ఆశగా చూస్తున్న రభస సినిమా వెనక్కు వెళ్లే అవకాశం వుందా? ఈ మేరకు ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట్లో ఇధి 14న అన్నారు. ఆ తరువాత 15 అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు…

ఎన్టీఆర్ అభిమానులు ఆశగా చూస్తున్న రభస సినిమా వెనక్కు వెళ్లే అవకాశం వుందా? ఈ మేరకు ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట్లో ఇధి 14న అన్నారు. ఆ తరువాత 15 అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇంకా పోస్టు ప్రొడక్షన్ పనులు మిగిలి వున్నాయని విడుదల చేయడం కష్టమని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క అల్లుడి శీను కలెక్షన్లు ఓ మాదిరగా వున్నాయని,. ఈ వారం కూడా సికిందర్ మినహా సరైన సినిమా లేదు. 

అందువల్ల రన్ రాజా రన్, సికిందర్ తో పాటు అల్లుడి శీను కు కూడా కలక్షన్లు వుంటాయని, అదే రభస వస్తే చాలా థియేటర్లు కూడా ఖాళీ చేయాల్సి వస్తుందని నిర్మాత బెల్లంకొండ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండింటికీ ఆయనే నిర్మాత కాబట్టి ఓ వారం వెనక్కు వెళ్లినా ఫరవాలేదు. అదీ కాక, ఇక్కడ చిన్న ట్విస్టు కూడా వుంది. ముందుగా తేదీ ప్రకటించి, అప్పటికప్పుడు సెన్సారుకు వస్తే సెన్సారు అధికారిణికి నచ్చదు. 

అల్లుడు శీను విషయంలో ఇలా జరిగితే మాయ నిర్మాతలు తమ స్లాట్ దానం చేసి, అల్లుడిని గట్టెక్కించారు. అయితే ఆ తరువాత వారికి స్లాట్ రాక, మాయ సినిమా విడుదల అనుమానంలో పడింది. అప్పుడు సాక్షాత్తూ సిఎమ్ లెవెల్ లో రికమండేషన్లు వాడాల్సి వచ్చిందని వినికిడి. ఇప్పుడు రభస విడుదలకు ఇంకా వారం రోజులే గడువుంది. ముందుగా అప్ లోడ్ చేస్తే తప్ప సెన్సారు గండం దాటడం కష్టం. అందువల్ల ఈ వంకా, ఆ వంకా చూపించి వినాయకచవితికి రభసను వాయిదా వేస్తే, అల్లుడికి మరిన్ని కలెక్షన్లు రాబట్టి, కనీసం పాతిక కోట్ల మార్కు చేరిందని చెప్పుకోవచ్చు. కనీసం పది కోట్ల లాస్ తో బయటపడవచ్చు.