చిత్తూరు దగ్గర మంచు ఫిల్మ్ సిటీ

ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులపై జనం దృష్టి పడుతోంది. తెలంగాణ, ఆంద్ర ప్రభుత్వాలు కొత్త అభివృద్ధి పథకాలకు రెడ్ కార్పెట్ పరుస్తుండడంతో చాలా మంది కొత్త ఆలోచనలు చేస్తున్నారు. టీవీ9 శ్రీనిరాజు మరి కొందరు…

ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులపై జనం దృష్టి పడుతోంది. తెలంగాణ, ఆంద్ర ప్రభుత్వాలు కొత్త అభివృద్ధి పథకాలకు రెడ్ కార్పెట్ పరుస్తుండడంతో చాలా మంది కొత్త ఆలోచనలు చేస్తున్నారు. టీవీ9 శ్రీనిరాజు మరి కొందరు నెల్లూరు సరిహద్దు తడ ప్రాంతంలో ఫిల్మ్ సిటీ పెట్టాలని చూస్తుంటే, ఇప్పుడు మంచు ఫ్యామిలీ చిత్తూరు జిల్లాపై దృష్టి సారించింది. నటుడు మోహన్ బాబు స్వస్థలం చిత్తూరు జిల్లా అన్న సంగతి తెలిసిందే. అందుకే బాబు ఓకె అంటే అక్కడ ఫిల్మ్ సిటీ కట్టాలని మోహన్ బాబు అండ్ సన్స్ డిసైడ్ అయ్యారు. అయితే బాబు ఓకె అనడం అంటే అక్కడ స్థలం కేటాయించాలన్నమాట. అందుకే మరో ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారమై బాబును నేరుగా కలవాలని మోహన్ బాబు నిర్ణయించారు. 

నిజానికి ఆ బాబు, ఈ బాబు ఇద్దరూ ఒకప్పుడు మాంచి మిత్రులే. హెరిటేజ్ సంస్థలో భాగస్వాములే. కానీ ఆ తరువాత దూరమయ్యారు. ఒక దశలో బాబుకు వ్యతిరేక ప్రచారం కూడా చేసారు. ఆ తరువాత వైఎస్ సోదరుడి కుమార్తెను కోడలిని చేసుకోవడం ద్వారా, ఆ కుటుంబానికి దగ్గరయ్యారు. 

అయితే వైఎస్ మరణించిన తరువాత మోహన్ బాబు న్యూట్రల్ అయ్యారు. కాస్త బాబు వైపే మొగ్గు చూపారు. బాబును తీసుకెళ్లి తన చిత్తూరు కళాశాలలో ఘనంగా సన్మానం కూడా చేసారు. ఆ విధంగా బాబులు ఇధ్దరూ దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే మంచు కుటుంబం చంద్రబాబును కలవనుంది. మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.