‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ ఆమధ్య మహేష్‌బాబుని కలిసి ఒక లైన్ చెప్పిన సంగతి తెలిసిందే. మనం చూసి విక్రమ్‌ని ప్రశంసలతో ముంచెత్తిన మహేష్ తనకి సూటయ్యే కథ ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడట. అప్పుడు విక్రమ్ అతనికో లైన్ చెబితే అది తనకి బాగా నచ్చినా కానీ తన ఇమేజ్‌కి సూట్ కాదని మహేష్ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసాడట.
అది కాకుండా వేరే లైన్ ఏదైనా ఉంటే కలవమని చెప్పాడట. మహేష్ కాదని చెప్పిన ఆ కథనే తమిళ హీరో సూర్య ఓకే చేసాడు. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. కథానుసారం హీరో వృద్ధుడి గెటప్ కూడా వేయాల్సి ఉంటుందట.
అది తన ఇమేజ్‌కి సూట్ కాదని మహేష్ తప్పుకున్నాడు కానీ సూర్య మాత్రం ఈ కథ వినగానే ఓకే చెప్పేసాడు. మహేష్ కనుక ఈ చిత్రం ఓకే చేసినట్టయితే అతడిని అరుదైన సినిమాలో త్రిపాత్రాభినయంలో చూసే అవకాశం మనకి దక్కేది. మహేష్‌తో పాటు మనమూ ఓ సూపర్ ఛాన్స్ మిస్ అయినట్టే.