ఎన్టీఆర్‌ చేతులెత్తేసాడు

ఎలాగైనా ‘రభస’ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసి తీరాలని అనుకున్నారు. ఎన్టీఆర్‌ స్వయంగా నిర్మాతకి ఆ డేట్‌ చెప్పి రిలీజ్‌ తప్పనిసరిగా అప్పుడే ఉండాలని చెప్పినట్టు ఫిలింనగర్‌లో చెప్పుకున్నారు. అయితే ఈ చిత్రం…

ఎలాగైనా ‘రభస’ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసి తీరాలని అనుకున్నారు. ఎన్టీఆర్‌ స్వయంగా నిర్మాతకి ఆ డేట్‌ చెప్పి రిలీజ్‌ తప్పనిసరిగా అప్పుడే ఉండాలని చెప్పినట్టు ఫిలింనగర్‌లో చెప్పుకున్నారు. అయితే ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో రభస ఆ టైమ్‌కి రిలీజ్‌ కావడం అనుమానంగా కనిపించింది. 

రన్‌ రాజా రన్‌, అల్లుడు శీను కలెక్షన్లు బాగుండడంతో ఆ బయ్యర్లు సదరు చిత్రాల్ని అప్పుడే థియేటర్ల నుంచి తొలగించడానికి ఇష్టపడడం లేదు. దీంతో రభసకి ఎక్కువ థియేటర్లు లభించకపోవచ్చునని వాయిదా వేసారని తెలిసింది. ఇంకా విడుదల తేదీ ఏంటనేది ప్రకటించకపోయినా కానీ ఈ నెలాఖరులో వినాయక చవితి సందర్భంగా రభస రిలీజ్‌ కావచ్చునని అంటున్నారు. 

రభస రిలీజ్‌ వాయిదా పడడంతో అదే రోజున విడుదలకి సిద్ధపడుతున్న సికిందర్‌ చిత్రానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఆగస్ట్‌ 15 సినిమా రిలీజ్‌కి బెస్ట్‌ డేట్‌ అని అనుకుంటూ ఉండగా, ఇలా రభస వాయిదా పడడం ఎన్టీఆర్‌ అభిమానుల్ని బాధిస్తోంది.