జ్యోతిలక్ష్మి సినిమాకి సీక్వెల్ తీస్తామని విడుదలకు ముందే పూరి, ఛార్మి, సికల్యాణ్ ప్రకటించేశారు. తీరా చూస్తే ఈ కథకి సీక్వెల్ లక్షణాలే లేవు. జ్యోతిలక్ష్మి క్యారెక్టరైజేషన్‌ని గానీ ఈ కథనిగానీ కంటిన్యూ చేసే వీలు లేదు. క్లైమాక్స్‌లోనూ ఎక్కడా లింకులు వదల్లేదు. దాంతో ఏ ఉద్దేశంతో పూరి ఈ సినిమాని సీక్వెల్ చేద్దామనుకొన్నాడో అర్థం కాలేదు.
ఓ సినిమా విడుదయ్యే ముందు, 'ఈటీమ్తో మరో సినిమా చేస్తా' అనో, 'ఈ సినిమాకి సీక్వెల్ తీస్తా' అనో దర్శక నిర్మాతలు ప్రకటిస్తుంటారు. తమ సినిమాపై తమకు బోల్డంత నమ్మకం ఉందనడానికి గుర్తుగా అన్నమాట. ఆ మాటలు..సినిమాలకు కాస్తో కూస్తో ప్రచారం తీసుకొస్తాయి.
జ్యోతిలక్ష్మి సీక్వెల్ కూడా ఆ టైపే అనిపిస్తోంది. సీక్వెల్‌పై పూరికి ఏమాత్రం నమ్మకం ఉన్నా రిజల్ట్, రివ్యూలు చూశాక అది కాస్త ఎగిరిపోయుంటుంది. సో.. వెండి తెరపై మళ్లీ జ్యోతిలక్ష్మిని చూసే ఛాన్స్ లేదన్నమాట.