జ్యోతిలక్ష్మిలో ఓ సీన్ ఉంది. ఓ కుర్రాడు వేశ్య దగ్గరకు వెళ్తాడు. మరీ ఓవరైపోయి… కాస్త ఎగస్ట్రా ఎనర్జీతో బీహెవ్ చేస్తుంటాడు. అక్కడే వేశ్య చేత డైలాగ్ పలికించాడు పూరి.
ఆమె:మీది భీమవరమా?
అతను: ఎలా చెప్పేశావ్…
ఆమె: మీ భీమవరం వాళ్లే ఇలా ఎగస్ట్రాలు చేసేది..
ఈ సీన్, డైలాగులు భీమవరం వాసుల్ని కాస్త ఇబ్బంది పెట్టేవే. ఎంత లైట్‌గా తీసుకొన్నా.. భీమవరం బ్యాచ్ కాస్త హర్టవుతుంది. సినీ పరిశ్రమలో భీమవరం వాళ్లు కొంచెం ఎక్కువే. పూరి వాళ్లను ఉద్దేశించి ఈ డైలాగ్ రాశాడా, లేదంటే.. యాదృచ్ఛికంగా అలా రాసేశాడా?? కామెడీ అంటే తూగో..అప్పుడప్పుడు శ్రీకాకుళం అయిపోయింది సినిమా వాళ్లకి ఇప్పుడు.