గుంటూరు కారంపై డిస్కషన్లు

ఉన్నట్లుండి సోషల్ మీడియాలో అన్యాపదేశ సందేశాలు. సూపర్ స్టార్ మహేష్ పేరు లేదు.. గుంటూరు కారం ఊసు లేదు కానీ కంటెంట్ ఒక్కటే.  Advertisement హీరో కథలో కూర్చోవడం లేదు.. కథ ఇలా వుండాలి…

ఉన్నట్లుండి సోషల్ మీడియాలో అన్యాపదేశ సందేశాలు. సూపర్ స్టార్ మహేష్ పేరు లేదు.. గుంటూరు కారం ఊసు లేదు కానీ కంటెంట్ ఒక్కటే. 

హీరో కథలో కూర్చోవడం లేదు.. కథ ఇలా వుండాలి అనడం లేదు.. కానీ చేసిన కథ మాత్రం బాగా లేదంటున్నాడు.. ఊ అంటే విదేశాలకు హాలీడే కు వెళ్తున్నాడు.. వచ్చిన తరువాత విన్న కంటెంట్ కు నో చెబుతున్నాడు… దీని మీద యూనిట్ జనాలు ఆఫ్ ది రికార్డుగా చికాకు పడుతున్నారు అన్నది కీలకం. ఇదీ విషయం.

అర్థం అవుతూనే వుంది. ఇదంతా గుంటూరు కారం గురించే అని. గుంటూరు కారం సినిమా మొదలైన దగ్గర నుంచి గడబిడ ఏదో రూపంలో జరుగుతూనే వస్తోంది. షూటింగ్ క్యాన్సిల్ కావడమో, వాయిదా పడడమో, కథ లేదా టెక్నీషియన్లు మారడమో జరుగుతూనే వస్తోంది. అయినా సినిమా మీద యూనిట్ వైపు నుంచి ఎటు వంటి రియాక్షన్ పెద్దగా లేదు. సినిమా ముందుకు వెళ్తోంది అనే ఫ్యాన్స్ సరిపెట్టుకుంటూ వచ్చారు.

కానీ ఎప్పుడైతే హీరో వైఖరితో యూనిట్ కీలక బాధ్యులు విసిగిపోతున్నారు అన్న పాయింట్ మీద సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైందో, ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపుల్లో డిస్కషన్లు మొదలయ్యాయి. ఫ్యాన్స్ సహజంగా హీరోను వెనకేసుకు వస్తారు. యాంటీ ఫ్యాన్స్ డైరక్టర్ ను వెనకేసుకువస్తారు. మొత్తానికి గుంటూరు కారం పేరుతోనో, లేకుండానో సోషల్ మీడియా హల్ చల్ చేస్తూనే వుంది. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది మాత్రం హీరోనే.

అవును ఇంతకీ.. మహేష్ అంటే నాన్ కోపరేటివ్ అనుకుందాం ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది.. అక్కడ తప్పు ఎవరిది అన్న డిస్కషన్ కూడా వుండనే వుంది.