పవన్ వస్తాడా?

కోల్డ్ స్టోరేజ్ లోంచి రేయ్ సినిమా బయటకు వచ్చింది. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరో. సాయి ధరమ్ తేజ వెనుక పవన్ అండ వుందని, అన్ని విధాలా సహాయం సహకారాలు వున్నాయని, పిల్లా…

కోల్డ్ స్టోరేజ్ లోంచి రేయ్ సినిమా బయటకు వచ్చింది. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరో. సాయి ధరమ్ తేజ వెనుక పవన్ అండ వుందని, అన్ని విధాలా సహాయం సహకారాలు వున్నాయని, పిల్లా నువ్వులేని జీవితం టైమ్ లోనే వెల్లడయింది. ఇప్పుడు రేయ్ కు కూడా పవన్ తన వంతు సహకారం అందించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఈ నెల 27న విడుదలయ్యే ఈ సినిమాకు ఓ ప్రత్యేక గీతాన్ని తయారు చేయించాడు నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి. పవనిజం పేరిట తయారైన గీతాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నారు ఓ ఫంక్షన్ లో. 

ఇప్పుడు ఈ ఫంక్షన్ కు పవన్ వస్తాడా రాడా అన్నది ఆసక్తికరమైన డిస్కషన్. సాయి ధరమ్ తేజ అంటే పవన్ కు బాగా అభిమానం. అందువల్ల ఈ సారి ఈ ఫంక్షన్ కు అందునా, ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి తప్పకుండా వస్తాడని వినిపిస్తోంది.