మెగాస్టార్ 150 వ సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వుంటుందా..వుండదా అన్న సందేహాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే, ఈ సినిమాకు కూడా పూరి జగన్నాధ్ ప్రొడక్షన్ తన చేతికి ఇచ్చేయమని అడిగినట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఈ తరహా ట్రెండ్ కు తెరతీసారు.
రౌడీ సినిమాను 12 కోట్లలో తయారు చేసి ఫస్ట్ కాపీ ఇచ్చారు.అందులోనే అన్నీ. ఇప్పుడు పూరి కూడా ఈ తరహాలోనే సినిమాలు చేస్తున్నట్లు వినికిడి. రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరికీ ప్రొడక్షన్ అనుభవం లేదు. అల్లు అరవింద్ నే ఇప్పటిదాకా అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. అందకే, మెగాస్టార్ రెమ్యూనిరేషన్ మినహా, కొంత బడ్జెట్ అనుకుని, ఆ మొత్తానికి సినిమాను తనకు అప్పగిస్తే, పూర్తి చేసి ఫస్ట్ కాపీ ఇస్తానని పూరి అడిగినట్లు వినికిడి.
కానీ ఈ పద్దతికి చిరంజీవి అంతగా ఇష్టపడడం లేదని తెలిసింది. బహుశా మెగాస్టార్ ఓకె అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చార్మి రంగంలోకి దిగుతుందేమో? ఇప్పుడు మొత్తానికి సినిమానే అనుమానంలో పడింది. మరి చార్మికి కొత్త కొలువు ఎక్కడ దొరుకుతుందో? వరుణ్ తేజ సినిమాలోనా?