ఆదివారం హుష్ కాకి

ఈ వారం విడుదలైన సినిమాలకు ఆదివారం మాయమైంది. సాధారణంగా ఆదివారం నాడు కలెక్షన్లు బాగా వుంటాయి. శుక్ర, శని, ఆది వారాలనే నిర్మాతలు నమ్ముకుంటారు.అలాంటిది ఈవారం విడుదలైన సినిమాలకు ఆదివారం కలెక్షన్లు లేకుండా పోయాయి.…

ఈ వారం విడుదలైన సినిమాలకు ఆదివారం మాయమైంది. సాధారణంగా ఆదివారం నాడు కలెక్షన్లు బాగా వుంటాయి. శుక్ర, శని, ఆది వారాలనే నిర్మాతలు నమ్ముకుంటారు.అలాంటిది ఈవారం విడుదలైన సినిమాలకు ఆదివారం కలెక్షన్లు లేకుండా పోయాయి. జనాలంతా టీవీలకు అతుక్కుపోవడమే ఇందుకు కారణం. 

మేము సైతం 12గంటల కార్యక్రమాలు, మరోపక్క దూకుడు, అత్తారింటికి దారేది, తడాఖా వంటి సినిమాలు కలిసి జనాలను కదలనివ్వకుండా చేసాయి. దీంతో కలెక్షన్లు కాస్త డల్ అయ్యాయి. ఇదిలా వుంటే కలెక్షన్లు ఎత్తాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

అలా ఎలా టీమ్ థియేటర్లను చుట్టేస్తూ, సినిమాకు పుషప్ ఇవ్వడానికి ట్రయ్ చేస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, దాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇక యమలీల 2 యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించింది. రఫ్ యూనిట్ మొదటి రెండు రోజుల కలెక్షన్లు చూసి ధీమాగా వుంది. కానీ మొదటి రోజు కన్నా మిగిలిన రెండు రోజులు కలెక్షన్లు డల్ అయ్యాయి.